8 ఏళ్ల తర్వాత తెలుగులో బాలీవుడ్ నటుడు.. నిర్మాత, దర్శకుడు, హీరో ఎవరంటే?
తెలుగు సినిమా రంగంలో ఇతర భాషల నటులు, టాలీవుడ్‌కు చెందిన యాక్టర్లు ఇతర భాషల్లో రూపొందిన సినిమాల్లో నటించడం సాధారణంగానే జరుగుతుంటాయి. అయితే బాలీవుడ్‌కు చెందిన ఓ యాక్టర్ తాజాగా తెలుగు సినిమాలో నటించడానికి ముందుకొచ్చారు. అయితే ఆ నటుడు సుమారుగా 19 ఏళ్ల తర్వాత ఆయన తెలుగులో నటించడం విశేషంగా మారింది. ఆ నటుడు ఎవరు? ఆ సినిమా ఏమిటనే వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్‌కు చెందిన నటుడు, సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ చిత్రంలో విలన్‌గా నటించాడు. ఆ తర్వాత 2016లో కిట్టు ఉన్నాడు జాగ్రత్త చిత్రంలో కూడా నటించారు. దాదాపు 8 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు సినిమాలో నటించడానికి సిద్దమయ్యాడు.

గంగా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై యువ హీరో అశ్విన్ బాబు నటిస్తున్న చిత్రాన్ని నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అప్సర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలో అర్బాజ్ ఖాన్ నటించేందుకు ఓకే చెప్పడం విశేషంగా మారింది.
అర్బాజ్ ఖాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగు సినిమాలంటే నాకు ఇష్టం. మరోసారి తెలుగు సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. గంగా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నటించడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పారు.
నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. డిఫరెంట్ స్టోరీతో ఈ సినిమాను నిర్మిస్తున్నాం. మా తొలి చిత్రంలోనే అర్బాజ్ ఖాన్ నటించడం, ఆయనతో పనిచేయడం హ్యాపీగా ఉంది. అశ్విన్ బాబు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇది న్యూ ఏజ్ సినిమా అని అన్నారు.
నటీనటులు: అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, సాయిధీన, అర్బాజ్ ఖాన్ తదితరులు
ఎడిటర్: ఛోటా కే ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్ (కార్తికేయ 2 ఫేమ్)
మ్యూజిక్ డైరెక్టర్: వికాస్ బడిస
సినిమాటోగ్రఫి: దాశరథి శివేంద్ర (హనుమాన్, మంగళవారం ఫేమ్)
నిర్మాత: మహేశ్వర్ రెడ్డి మూలి
దర్శకత్వం: అప్సర్


Click it and Unblock the Notifications











