RRR హీరోయిన్ ఆలియా కొన్న ఖరీదైన కారు ధర ఎంతో తెలుసా? భర్తతో కలిసి ఆ హీరోయిన్ ఇంటికి!

RRR చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ అలియా భట్. బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ చిత్రాలతో అగ్ర హీరోయిన్‌గా పేరు తెచ్చుకొన్న ఆమె రెండేళ్ల క్రితం బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకొన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల రెండో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్టార్ కపుల్ ఇటీవల ఖరీదైన కారును కొనుగోలు చేశారు. ఆ కారు ధర ఎంత? ఆ కారులో ఓ హీరోయిన్ ఇంటికి ఎందుకు వెళ్లారనే వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్‌లో ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ వారిద్దరి మధ్య రిలేషన్ ఏర్పడలేదు. కానీ బ్రహ్మస్త్ర సినిమా షూటింగులో ఇద్దరు ప్రేమలో పడ్డారు. కొద్దికాలం డేటింగ్ చేసిన తర్వాత ఏప్రిల్ 14, 2022 రోజున వివాహం చేసుకొన్నారు. వారిద్దరికి నవంబర్ 6వ తేదీన రాహ అనే పండంటి కూతురు పుట్టింది. తమ రెండో పెళ్లి సంవత్సరం రోజును పురస్కరించుకొని బెంట్లీ కారును కొనుగోలు చేశారు.

Do You Know How Much Cost of Bentley Car of Alia Bhat Ranbir Kapoor Here is details

తాజాగా కొనుగోలు చేసిన బెంట్లీ కారు లేటేస్ట్‌గా మార్కెట్‌లోకి వచ్చింది. ఈ కారు విలువ సుమారు 6 కోట్ల రూపాయలు. ఈ కారులో శనివారం రాత్రి ముంబై వీధుల్లో ప్రయాణిస్తూ మీడియా కంటికి చిక్కారు. ప్రస్తుతం వారు ప్రయాణిస్తున్న కారు ఫోటోలు మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.

బెంట్లీ కారులో నలుపు రంగు సూట్‌లో రణ్‌బీర్, పింక్ కలర్ డ్రెస్‌లో ఆలియా భట్ ఆకర్షణీయంగా కనిపించారు. అయితే వారి వెంట రాహా లేకపోవడంతో చిన్నారి ఎక్కడ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే వారిద్దరూ ఇటీవలే వివాహం చేసుకొన్న జాకీ భగ్నానీ, రకుల్ ప్రీత్ సింగ్ నివాసానికి వెళ్లి కలిశారు.

Do You Know How Much Cost of Bentley Car of Alia Bhat Ranbir Kapoor Here is details

రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ ఇంటిలో జరిగిన ప్రైవేట్ పార్టీలో రణ్‌బీర్, ఆలియా ప్రత్యేక ఆకర్షణగా మారారు. వీరికి జాకీ ఇంటి గేట్ వద్ద శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా స్వాగతం పలికారు. రాత్రి జరిగిన పార్టీలో చాలా మంది సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక రణ్‌బీర్ కపూర్ విషయానికి వస్తే.. ఇటీవల ఆయన నటించిన యానిమల్ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం సుమారుగా 990 కోట్ల రూపాయలు వసూలు చేసింది. బాలీవుడ్ చరిత్రలో అతిపెద్ద విజయం సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X