అనంత్ అంబానీ సంగీత్ ఈవెంట్‌లో సల్మాన్ ఖాన్ స్టెప్పులు.. రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారో తెలుసా?
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ, నీతా అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహా కార్యక్రమాలు అట్టహాసంగా మొదలయ్యాయి. పెళ్లిలో భాగమైన సంగీత్ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుక కోసం బాలీవుడ్ సినీ ప్రముఖులు, ఇండియన్ క్రికెటర్లు, వ్యాపార వేత్తలు, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో సల్మాన్ ఖాన్, ఇంటర్నేషనల్ పాప్ సింగ్ జస్టిన్ బీబర్ ప్రత్యేక ఆకర్షణగా మారారు. సంగీత్ వేడుక వివరాల్లోకి వెళితే..
జూలై 5వ తేదీ సాయంత్రం ముంబైలోని కల్చరల్ సెంటర్‌లో జరిగిన వేడుకలో ధోని దంపతులు, కాజల్ దంపతులు, ఆలియా భట్ దంపతులు, సల్మాన్ ఖాన్, సారా ఆలీ ఖాన్, రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, పాండే తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకలో అందరూ డ్యాన్సులు చేస్తూ హోరెత్తించారు.

ఇక అనంత్ అంబానీ సంగీత్ వేడుకలో సల్మాన్ ఖాన్ డ్యాన్స్ వైరల్ అయింది. స్వయంగా అనంత్ అంబానీ ప్రత్యేకమైన వాహనంపై కూర్చోబెట్టి సల్మాన్ ఖాన్‌ను వేదికపైకి తీసుకొచ్చారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ నటించిన సినిమాల్లోని పాటపై అనంత్, ఆయన స్నేహితులు డ్యాన్స్ చేశారు.
ఇక అనంత్ అంబానీ సంగీత్ వేడుకలో ధోని డ్యాన్స్ కూడా వైరల్ అయింది. జుమ్మె కి రాత్ పాటపై సల్మాన్, ధోని, ఇతర క్రికెటర్లు తమదైన స్టయిల్‌లో స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా, అంబానీ ప్యామీలీ వేడుకల్లో జరిగిన సంగీత్ ఫంక్షన్‌లో సల్మాన్ ఖాన్ డ్యాన్స్ చేసినందుకు భారీగా నజరానా ఇచ్చారని బాలీవుడ్‌లో టాక్. ఈ వేడుకలో స్టెప్పులేసిన పాటకు సుమారుగా 20 కోట్ల రూపాయలు ఇచ్చారనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉండగా, ఈ వేడుకలోనే డ్యాన్స్ చేసిన జస్టిన్ బీబర్‌కు 80 కోట్లకుపైగా రెమ్యునరేషన్ ఇచ్చారనేది తాజా సమాచారం.


Click it and Unblock the Notifications











