Ranbir Alia Car Collections రణ్‌బీర్, ఆలియా వద్ద ఎన్ని ఖరీదైన కారు? ఎన్ని కోట్ల విలువైన వాహనాలు ఉన్నాయంటే?

బాలీవుడ్‌లో స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ దంపతులిద్దరూ కూడా గొప్ప ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉంది. సినీ పరిశ్రమలో లెజెండరీ ఫిల్మ్ మేకర్ రాజ్ కపూర్ వారసత్వాన్ని రణ్‌బీర్ పుణికి పుచ్చుకొంటే.. దిగ్గజ డైరెక్టర్ మహేష్ భట్ కుటుంబం నుంచి ఆలియా సినీ తెరకు పరిచయమైన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరికి కూడా ఆస్తులు, వారు వాడే వాహనాలు విలువ కోట్లల్లో ఉంటుంది. అయితే ఇప్పటికే ఎన్నో కార్లు ఉన్న వారు తాజాగా 8 కోట్ల రూపాయలు పెట్టి ఓ కారును కొనుగోలు చేయడం బాలీవుడ్ మీడియాలో హైలెట్ అయింది. అయితే వారిద్దరికి ఎన్ని కోట్లు విలువ చేసే కార్లు ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

యానిమల్ బ్లాక్ బస్టర్ కావడంతో ఆలియా, రణ్‌బీర్ దంపతులు ఆనందంలో మునిగిపోతున్నారు. త్వరలోనే వారిద్దరూ రెండో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా అత్యంత విలాసమైన, ఖరీదైన బెంట్లీ కారును 8 కోట్ల రూపాయలు పెట్టి కొన్నారు. ఆ కారులోనే రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ ఇచ్చిన పార్టీకి హాజరయ్యారు.

Do You Know How much Worth of Cars Collection Ranbir Kapoor and Alia Bhatt had Here is details

అయితే రణ్‌బీర్ వద్ద ఉన్న కార్ల విషయానికి వస్తే.. ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్ కార్లు ఉన్నాయి. వాటి విలువ 3.27 కోట్ల రూపాయలు. అలాగే అతడి వద్ద ఆడి ఏ8 ఎల్ కారు ఉంది. దాని విలువ 1.7 కోట్ల రూపాయలు. అతడి కార్ల కలెక్షన్లలో మెర్సిడెజ్ ఏఎమ్‌జీ జీ 63 కారు ఉంది. దాని ధర 2.3 కోట్ల రూపాయలు. అలాగే ఆడీ ఆర్8 కారు కూడా ఉంది. దాని రేటు 2.78 కోట్ల రూపాయలు.

రణ్‌బీర్ వద్ద విలాసవంతమైన, ఖరీదైన కార్లు ఐదు ఉన్నాయి. ఆ వాహనాల మొత్తం ధర 10 కోట్ల రూపాయలుగా లెక్కకట్టారు. తాజాగా అతడి ఖాతాలో 8 కోట్ల విలువైన బెంట్లీ కారు కూడా చేరింది. రణ్‌బీర్‌కు కార్ల కలెక్షన్ అంటే ఓ హాబీ అని బాలీవుడ్‌లో చెప్పుకొంటారు.

Do You Know How much Worth of Cars Collection Ranbir Kapoor and Alia Bhatt had Here is details

ఇక ఆలియాభట్ విషయానికి వస్తే.. ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్ కారు ఉంది. దాని ఖరీదు 3 కోట్ల రూపాయలు.ఆమె వద్ద ఆడీ ఏ6 కారు ఉంది. దాని విలువ 70 లక్షల రూపాయలు. అలాగే ఓ బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారు ఉంది. దాని రేటు 2 కోట్ల రూపాయలు, ఇదే కాకుండా 80 లక్షల రూపాయల విలువైన ఆడీ క్యూ 5 కారు, 1 కోటి రూపాయల ఖరీదైన ఆడీ క్యూ 7 కారు ఉంది.

ఆలియా భట్ వద్ద ఉన్న కార్ల విలువ విషయానికి వస్తే.. మొత్తంగా 7 కోట్ల రూపాయల విలువైన కార్లు ఉన్నాయి. రణ్‌బీర్ మాదిరిగానే ఆమెకు కూడా వెహికిల్ కలెక్షన్ అంటే ఇష్టమని తన స్నేహితులు, సన్నిహితులు చెబుతుంటారు. ఏది ఏమైనా ఖరీదైన కార్లు కొనడంలో రణ్‌బీర్, అలియా ఎప్పుడూ ముందుంటారని సీనీ వర్గాలు పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X