Koffee with Karan 8 దీపిక పదుకోన్‌తో 3 ఏళ్ల డేటింగ్.. సముద్రంలోకి తీసుకెళ్లి రణ్‌వీర్ ఏం చేశాడో తెలుసా?
బాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్ కపుల్ దీపిక పదుకోన్, రణ్‌వీర్ సింగ్ తాజాగా కరణ్ జోహర్ హోస్ట్‌గా ఉండే కాఫీ విత్ కరణ్ షోకు వచ్చారు. వాళ్ల డేటింగ్, అఫైర్ విషయాల నుంచి పెళ్లి వరకు జరిగిన విషయాలను ఈ షోలో పంచుకొన్నారు. దీపికకు ఎలా ప్రపోజ్ చేసిన విషయాల దగ్గర నుంచి పెళ్లి వరకు పెద్దలను ఎలా ఒప్పించామనే విషయాలను ఆసక్తికరంగా వెల్లడించారు. రణ్‌వీర్ సింగ్ చెప్పిన విషయాల వివరాల్లోకి వెళితే..
రామ్ లీలా సినిమా మా ఇద్దరిని ఒకటి చేసింది. మా అభిప్రాయాలు, అభిరుచులు కలవడంతో మేమిద్దరం 2012 నుంచి డేటింగ్ మొదలుపెట్టాం. మూడేళ్ల తర్వాత నేను చొరవ తీసుకొని 2015లో సీక్రెట్‌గా ప్రపోజ్ చేశాను. అయితే దీపిక కూడా ఒకే అనడంతో మా పెళ్లికి లైన్ క్లియర్ అయింది. ప్రోపోజ్ చేయడానికి ముందు నా ఫ్యామిలీలో ఎవరికీ చెప్పలేదు అని రణ్‌వీర్ సింగ్ తెలిపాడు.

2015 సంవత్సరంలో నా సంపాదన అంతంతా మాత్రమే ఉండేది. నేను మా అమ్మ, సిస్టర్ నుంచి కొంత డబ్బు తీసుకొన్నాను. మేమిద్దరం మాల్దీవులకు వెకేషన్ ప్లాన్ చేశాం. అక్కడే దీపికకు ప్రపోజ్ చేయాలని ప్లాన్ చేశాను. నేను ఖరీదైన రింగ్ కొన్నాను. నా ఫ్రెండ్స్‌కు ప్రపొజల్ విషయం చెబితే.. నీ తల్లిదండ్రులకు చెప్పవా? అని అడిగారు. నేను ఎందుకు చెప్పాలి అని వారికి ప్రశ్న వేశాను. నేను దీపికను పెళ్లి చేసుకోవాలని అనుకొన్నాను. అడిగితే నేను దీపికను అడగాలి అని రణ్‌వీర్ అన్నాడు.
దీపికను నేను మాల్దీవులకు తీసుకెళ్లాను. నా జేబులో సీక్రెట్‌గా రింగ్ పెట్టుకొన్నాను. ఓ బోటులో సముద్ర మధ్యకు తీసుకెళ్లాను. ఓ పక్క ఇసుక మేట కనిపిస్తున్నది. ద్వీపం లాంటి ప్రదేశంలో ఆగిపోయాం. కనుచూపు మేర చుట్టూ సముద్రమే ఉంది. సముద్రం మధ్యలో నేను, దీపిక మాత్రమే ఉన్నాం. ఇదే మంచి సమయం అనుకొన్నాను. పిక్చర్ ఫర్‌ఫెక్ట్ సీన్ ఉంది. అప్పుడే నేను రింగ్ తీసి ప్రపోజ్ చేశాను అని రణ్‌వీర్ సింగ్ చెప్పాడు.

నేను రింగ్ ఇవ్వడంతో దీపిక ఎమోషనల్ అయింది. నేను అప్పుడు ఈ ప్రపంచానికి రాజులా ఫీలయ్యాను. ఆ తర్వాత నా లవ్ ప్రపోజల్‌ను ఒప్పుకొన్నది. అలా మా ప్రేమ కథ పెళ్లికి దారి తీసింది. మాల్దీవుల నుంచి వచ్చాక నేను, దీపిక బెంగళూరుకు వెళ్లాం. మా పెళ్లి విషయాన్ని వాళ్లకు చెప్పాలని డిసైడ్ అయ్యాం అని రణ్‌వీర్ సింగ్ చెప్పాడు.
బెంగళూరులో దీపిక తల్లిదండ్రులు ప్రకాశ్ పదుకోన్, ఉజాలా, కొంత మంది వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్‌తో డిన్నర్‌కు వెళ్లాం. అయితే నేను చెప్పేస్తా అని దీపిక నా చెవిలో చెప్పింది. అయితే వద్దని వారించాను. కానీ ఉన్నట్టుండి.. రణ్‌వీర్ ప్రపోజ్ చేశాడు. మేమిద్దరం పెళ్లి చేసుకొంటామని చెప్పగానే.. దీపిక తల్లి షాక్ గురైంది అని రణ్ వీర్ చెప్పాడు.

అయితే హోటల్‌లో మా పెళ్లి గురించి దీపిక చెప్పిన మాటలు విన్న తర్వాత ఆమె తల్లి మనస్తాపానికి గురైంది. ఇంటికి వెళ్లిన తర్వాత నేను ఓ గదిలోకి వెళ్లాను. గది బయట దీపిక, ఉజాలా ఇద్దరు గట్టిగా వాదించుకోవడాన్ని గదిలో డోర్ వెనుక నుంచి విన్నాను. ఆ తర్వాత దీపిక తల్లి కన్విన్స్ అయ్యారు. దీపిక తల్లిదండ్రులు నాకు పేరెంట్స్ కంటే ఎక్కువగా చూసుకొంటున్నారు అని రణ్‌వీర్ చెప్పారు.


Click it and Unblock the Notifications











