మణిరత్నం ఫోన్ చేస్తే కట్ చేసిన హీరోయిన్? స్టార్ డైరెక్టర్ ఆఫర్‌ను ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలుసా?
సినీ పరిశ్రమలో వచ్చే అరుదైన అవకాశాలు మిస్ చేసుకోవడం అనేది హీరోయిన్లకు సాధారణంగా ఎదురవుతూనే ఉంటాయి. నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఇచ్చే ఆఫర్లను సరైన రీతిలో గుర్తించి అవకాశాలను చేజిక్కించుకొంటే హీరోయిన్ల కెరీర్‌కు ఎలాంటి ఢోకా ఉండదు. ఇలాంటి పరిస్థితి గురించి బాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్ కాజోల్ దేవగన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని విషయాల్లోకి వెళితే..
కెరీర్ ఆరంభంలో షారుక్ ఖాన్‌తో బాజీఘర్ సినిమాలో కలిసి నటించాను. అప్పటికీ నేను, షారుక్ సినిమా పరిశ్రమకు కొత్త. ఆ సినిమా షూట్‌లోనే మా మధ్య పరిచయం పెరిగింది. అప్పటి నుంచి మా బంధం మరింత బలంగా మారింది. ఇప్పటికీ మా మధ్య రిలేషన్ విడదీయలేని విధంగా ఉంది అని కాజోల్ చెప్పింది.

బాజీఘర్ సినిమా షూట్‌లో చాలా విచిత్రమైన, ఫన్నీ సంఘటనలు చోటుచేసుకొన్నాయి. డిసెంబర్ 31 రాత్రి ఫుల్లుగా పార్టీ చేసుకొన్నారు. జనవరి 1వ తేదీన ఉదయం షూటింగ్‌కు షారుక్ వచ్చి తలపట్టుకొన్నాడు. హ్యాంగోవర్ వల్ల ఇబ్బంది పడుతున్నానని.. కళ్లకు గాగుల్స్ పెట్టుకొని రిలాక్స్ అయ్యాడు అని కాజోల్ తన షూటింగ్ అనుభవాలు చెప్పింది.

షారుక్ ఖాన్‌తో నాకు స్నేహబంధం బలపడిన తర్వాత నన్ను విపరీతంగా ఏడిపించేవాడు. ప్రాంక్ కాల్స్‌తో నన్ను కన్‌ఫ్యూజ్ చేసేవాడు. షారుక్ ఖాన్ ప్రాంక్ కాల్స్ నన్ను చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఓసారి నాకు మణిరత్నం కాల్ చేస్తే కట్ చేశాను. షారుక్ ఖాన్ కాల్ చేశాడని నేను అనుకొని మణిరత్నం కాల్ మాట్లాడుతున్నాడని ఫోన్ పెట్టేశాను అని కాజోల్ చెప్పింది.
మణిరత్నం ఫోన్ కట్ చేసిన తర్వాత షారుక్ వెంటనే కాల్ చేసి. నీకు కాల్ చేసింది మణిరత్నం. మీకు ఓ సినిమా ఛాన్స్ ఇవ్వడానికి కాల్ చేశారు అని కాజోల్ చెప్పారు. ఆ తర్వాత మణిరత్నం కాల్ చేస్తే నేను క్షమాపణ చెప్పి ఆయనతో మాట్లాడాను అని కాజోల్ వెల్లడించింది. అలా షారుక్ ఖాన్ వల్ల నాకు చాలాసార్లు ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి.

మణిరత్నం ఆ సమయంలో కాల్ చేసి.. దిల్ సే సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఆఫర్ ఇచ్చారు. అయితే ఆ సమయంలో నా డేట్స్ సెట్ కాకపోవడంతో ఆ సినిమాను వదులుకొన్నాను. మణిరత్నం సినిమాలో అవకాశం వచ్చినా.. చేయలేకపోవడం కొంత బాధగా ఉంది. మరోసారి అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అని కాజోల్ అన్నారు.


Click it and Unblock the Notifications











