నువ్వే నా మొగుడివి.. కుర్ర హీరో వెంటపడిన సూపర్‌స్టార్ కూతురు.. చివరికి విషాదం ఏమిటంటే?
సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలను చూసి హీరోయిన్లు మోజుపడటం సర్వసాధారణమే. అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో ఆ హీరోతో నటించాలని ఉంది. ఫలానా నటుడు అంటే నాకు క్రష్. ఆ హీరోతో నటించే ఛాన్స్ వస్తే.. అంతకంటే జీవితంలో ఏముంటుందనే హీరోయిన్ల మాటలు భారీగానే వినిపిస్తుంటాయి. అయితే ఓ స్టార్ హీరోను చూసి ఏకంగా ఓ సూపర్ స్టార్ కూతురే ముచ్చటపడి చేదు అనుభవాన్ని చూసింది. ఏకంగా చట్టపరమైన లీగల్ కేసులను ఎదుర్కొన్నది. ఆ ఇద్దరి కథలో వెళితే..
హిందీ సినిమా పరిశ్రమలో సూపర్ స్టార్, లెజెండరీ యాక్టర్ రాజ్ కుమార్ గురించి వినే ఉంటారు. గంభీరమైన కంఠం, తీక్షణమైన చూపులతో తెరపైన విలన్లకే కాకుండా ప్రేక్షకులకు వణుకు పుట్టించే నటనను ప్రదర్శించే వారు. అలాంటి దిగ్గజ నటుడికి వాస్తవికత పండిట్ అనే గారాల కూతురు ఉండేది. అయితే ఆ దిగ్గజ నటుడు బతికి ఉన్నంత కాలం కూతురు సంప్రదాయంగా పెంచి సినీ ప్రపంచానికి దూరంగా ఉంచారు.

రాజ్ కుమార్ మరణాంతరం ఆయన కూతురు స్వేచ్ఛా వాయువులు పీల్చాలని అనుకొన్నది. మెల్లమెల్లగా రంగుల సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టడం మొదలుపెట్టింది. అలా కొన్ని సినిమాలు చేసినప్పటికీ సక్సెస్ కాలేకపోయింది. రాజ్ కుమార్ కూతురుగానే గుర్తింపు ఇచ్చి సినిమాల్లో నటింపజేశారు. ఓ సినిమాలో సరిగా నటించలేదనే కారణంతో ఆమెను మధ్యలోనే తొలగించడం సంచలనం రేపింది.
అలాంటి సమయంలో బాలీవుడ్‌లో అప్పట్లో కుర్ర హీరో షాహిద్ కపూర్‌ను చూసి మనసు పారేసుకొన్నది. డ్యాన్స్ స్కూల్‌లో వారిద్దరికి పరిచయం జరిగింది. ఆ సమయంలో నేను నీకు ఫ్యాన్‌ను అంటూ వెంటపడటం మొదలుపెట్టింది. నీవు లేకపోతే నా జీవితం వ్యర్తం అంటూ చెప్పిన డైలాగ్స్ ఆయనను భయపెట్టేశాయి. అయితే ఆమె వేధింపులు భరించలేక షాహిద్ కపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడనేది మీడియా కథనం.

తన వెంటపడుతూ తనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నది. నేను ఇంటి నుంచి బయటకు వెళ్తే నా వెంటనే వస్తున్నది. నా కారుకు అడ్డంగా పడి నన్ను ఇబ్బందికి గురిచేసింది. నేను రిజెక్ట్ చేసినా.. నా ఇంటి పక్కనే మరో ఇంటిలో అద్దెకు దిగింది. షాహిద్ భార్యను అంటూ అందరికి పరిచయం చేసుకొంటున్నది. కాబట్టి ఈ విషయంలో నాకు సరైన రక్షణ కల్పించండి అని ముంబైలోని వెర్సోవా పోలీసులకు షాహిద్ కపూర్ ఫిర్యాదు చేశారు.
షాహిద్ కపూర్ ఫిర్యాదు జాతీయ మీడియాలో సంచలనం రేపింది. అప్పటి నుంచి వాస్తవికత పండిట్ బాహ్య ప్రపంచానికి దూరమైంది. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోయింది. పోలీసులు, కుటుంబ సభ్యులు వెతికినా ప్రయోజనం లేకపోయింది. చివరకు ఆమె మిస్పింగ్ అంటూ కేసు నమోదు చేశారు. ఆమె మతిస్థిమితం కోల్పోయి ఎక్కడికో వెళ్లిందనే వార్తలు వినిపించాయి. అలా ఓ భగ్న ప్రేమికురాలి జీవితం విషాదంగా మిగిల్చింది.


Click it and Unblock the Notifications











