ఫ్లోర్ క్లీనింగ్, కేఫ్‌లో వర్కర్‌గా పని చేసి... 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొంటున్న బోల్డ్ నటి ఎవరో తెలుసా?

బ్యాగ్రౌండ్ లేకపోతే సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టం అనేది తరచుగా వినిపించే మాట. నెపోటిజం అంటూ స్టార్ కిడ్స్ పై జరిగే ట్రోలింగ్ ను కూడా చూస్తూనే ఉన్నాము. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోని వచ్చే నటీనటులు అక్కడ స్థానం సంపాదించడానికి, గుర్తింపు పొందడానికి ముందు ఎన్నో కష్టాలు పడతారు.

అలాగే ప్రస్తుతం ఒక్కో సినిమాకు రెండు కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటున్న ఓ స్టార్ నటి ఒకప్పుడు తినడానికి తిండి లేక చాలా కష్టపడాల్సి వచ్చిందట. ఫ్లోర్లు తుడవడంతో పాటు, ఫ్రీగా ఫుడ్ దొరుకుతుందనే ఆలోచనతో ఒక కేఫ్ లో పని కూడా చేసిందట. ఒకే ఒక్క ఇంస్టాగ్రామ్ పోస్టుతో తన జీవితాన్ని మార్చేసుకున్న ఆ నటి ఎవరు? అనే ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలుసుకుందాం పదండి.

Do You Know Neena Gupta Worked Floor Cleaner and now taking 2 Crores Remuneration in the Bollywood

ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా తన యాక్టింగ్ తో పాటు తరచుగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి నటిగా, హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నీనా ఈరోజు స్టార్ గా ఎదగడం వెనుక ఎన్నో కన్నీటి గాథలు ఉన్నాయట.

ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో తను నటిగా మారడానికి ముందు ఎన్ని కష్టాలను పడ్డాను అనే విషయాన్ని వివరించింది నీనా. కెరీర్ మొదట్లో తాను ముంబైకి వచ్చినప్పుడు జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంది నీనా. సినిమాల్లో నటించాలనే కోరికతో తన ప్రియుడితో కలిసి ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చారట ఈ సీనియర్ నటి. అయితే అప్పట్లో ఒంటరిగా అడుగు వేసే ధైర్యం లేక, తన ప్రియుడిని వెంట తెచ్చుకున్నారట.

Do You Know Neena Gupta Worked Floor Cleaner and now taking 2 Crores Remuneration in the Bollywood

ఇక ముంబైకి వచ్చాక పూట గడవడం కోసం పృథ్వి కేఫ్ లో పని చేసేదట. అక్కడ అయితే పనితో పాటు ఉచితంగా ఆహారం కూడా దొరుకుతుందనే ఉద్దేశంతో అలా చేసిందట నీనా. కానీ ఆ సమయంలో తన బాయ్ ఫ్రెండ్ కేఫ్ లో పని చేస్తున్నందుకు తనను వెక్కిరించేవాడని గుర్తు చేసుకుంది ఆమె.

అక్కడ తన పరిస్థితిని చూసి నువ్వు పని మనిషిగా మారడానికే ముంబై వచ్చావా? అని అతను ప్రశ్నించే వాడట. ఇక తన మాజీ ప్రియుడు సిగరెట్ తాగడానికి కూడా తన దగ్గరే డబ్బులు అడిగేవాడని, ఇంకొకరి నుంచి డబ్బు అడగడానికి సిగ్గుపడాలి కానీ పని చేయడానికి సిగ్గు పడకూడదని తాను చెప్పేదాన్ని నీనా వెల్లడించారు.

ఇక చిన్న చిన్న పనులు చేయడానికి తను ఎప్పుడూ భయపడనని, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో తను అన్ని రకరాల పనులు చేశానని ఈ సందర్భంగా బయట పెట్టింది నీనా. ప్రస్తుతమైతే స్టార్ నటి కానీ అప్పట్లో అక్కడ ఊడవడం దగ్గర్నుంచి తుడవడం వరకు అన్ని పనులు తను చేశానని చెప్పుకొచ్చింది.

ఇక పని చేయడం గురించి మాట్లాడుతూ తను పెరిగిన ఇంట్లో ఏ పని మనిషిని కూడా ఉంచలేదని నీనా వివరించారు. తన తల్లి గాధేయవాది కావడంతో చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి పనిని తానే స్వయంగా చేసుకునేదాన్ని కాబట్టి ఎలాంటి పని అయినా సరే చేయడానికి తను సిగ్గుపడనని క్లారిటీ ఇచ్చింది ఈ సీనియర్ నటి.

ఇక అవకాశాల కోసం ఆమె బ్యాక్ గ్రౌండ్ లేక చాలానే కష్టపడాల్సి వచ్చింది. 1982లో సినిమా ఎంట్రీ ఇచ్చిన నీనా కెరీర్ మొదట్లో ఎన్నో తప్పులు చేసిందట. ఒకానొక సమయంలో అవకాశాలు లేక ఇంస్టాగ్రామ్ లో అవకాశాల కోసం రిక్వెస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ 62 ఏళ్ల నటి ఒక్కో సినిమాకు రెండు కోట్లు పారితోషకంగా అందుకుంటుంది. ఇప్పటి వరకు నీనా రెండు జాతీయ అవార్డులను అందుకోగా ప్రస్తుతం ఆమె ఆస్తి 75 కోట్లు అని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X