35 కోట్ల బిజినెస్.. 50 టికెట్లు అమ్మకం..10000 కలెక్షన్లు.. 2023లో డిజాస్టర్ సినిమా ఏంటో తెలుసా?
సినిమా ప్రపంచంలో హిట్లు, ఫ్లాపులు సహజమే. ఏడాదిలో 100 సినిమాలు రిలీజ్ అయితే.. దాదాపు 95 శాతం సినిమాలు ఫ్లాపులుగానో, యావరేజ్‌గానో మిగిలిపోతాయి. అయితే 2023 సంవత్సరంలో సినీ ట్రేడ్ వర్గాలను ఓ సినిమా దిగ్బ్రాంతికి గురిచేసింది. కోట్ల రూపాయలతో రూపొందిన మూవీ కనీసం వేల రూపాయలను కూడా బాక్సాఫీస్ వద్ద రాబట్టలేకపోయింది. ఆ సినిమా వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్‌లో ఐదు కథలతో రూపొందిన పంచ్ కృతి 33 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ఈ సినిమా సంజయ్ భార్గవ్ దర్శకత్వంలో రూపొందగా, హరిప్రియా భార్గవ్, సంజయ్ భార్గవ్ స్వయంగా నిర్మించారు. ఈ చిత్రం బ్రిజేంద్ర కాలా, తన్మయ్ చతర్వేది తదతరులు నటించారు. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన రిలీజ్ అయింది.

పంచ్ కృతి సినిమా రిలీజ్‌కు భారీగానే బిజినెస్ నమోదు చేసింది. దాదాపు 35 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఈ సినిమాకు ప్రేక్షకులు ముఖం చాటేయగా.. సినీ విమర్శకులు ఘాటుగా స్పందించారు.
అంతంతా మాత్రమే టాక్ సంపాదించుకొన్న పంచ్ కృతి సినిమాకు భారీ బడ్జెట్ చిత్రాలు పోటీగా నిలిచాయి. ఈ సినిమాకు ముందు విడుదలైన గదర్ 2, ఓమైగాడ్ 2 సినిమా, అలాగే షారుక్ ఖాన్ జవాన్ సినిమా మధ్య నలిగిపోయింది. దాంతో ఈ సినిమా వైపు ప్రేక్షకులు కన్నెత్తి చూడటానికి అవకాశం లేకపోయింది.

ట్రేడ్ వర్గాల రిపోర్టు ప్రకారం.. పంచ్ కృతి చిత్రం థియేట్రికల్ రిలీజై దారుణంగా పరాజయం పాలైంది. వారం రోజుల్లో ఈ సినిమా మొత్తంగా 50 టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమా ఏడు రోజుల్లో 10000 రూపాయలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద వసూలు చేసింది. దాంతో 2023లో డిజాస్టర్‌గా నిలిచిన చిత్రాల్లో ముందు వరుసలో నిలిచింది.


Click it and Unblock the Notifications











