అందంలోనే.. ఆస్తులోనూ ఈ యంగ్ హీరోయిన్ దిట్ట.. బ్యాంక్ బ్యాలెన్స్ తెలిస్తే షాకే

వెండితెర మీద హీరోయిన్‌గా వెలిగిపోవాలని కోట్లాది మంది కలలు కంటారు కానీ.. అందులో కేవలం కొందరికే ఆ అవకాశం దక్కుతుంది. తాజాగా బాలీవుడ్ తెరకు పరిచయమైన నూతన తార రాధిక మదన్. అయితే అందాల తారగా సినీ దిగ్గజాలనే కాకుండా విమర్శకులను కూడా ఎంతగానో ఆకట్టుకొన్నది. కేవలం అందం, అభినయమే కాదు.. ఈమె ఆస్తులు కూడా అందర్నీ ఆకట్టుకొన్నది. సంపన్న కుటుంబంలో నుంచి వచ్చిన బ్యూటీ ఆస్తులు ఎంతంటే..

అంగ్రేజీ మీడియంలో ఉత్తమ నటన

అంగ్రేజీ మీడియంలో ఉత్తమ నటన

తాజాగా విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ నటించిన అంగ్రేజీ మీడియం సినిమా ద్వారా రాధిక మదన్ బాగా గుర్తింపు తెచ్చుకొన్నారు. ఈ చిత్రానికి ముందు 2018లో పటాకా, 2019లో మర్ద్ కో దర్ద్ నహీ హోతా అనే చిత్రాల్లో నటించినా గొప్పగా గుర్తింపు పొందలేదు. అయితే తండ్రి, కూతుళ్ల మధ్య నడిచే భావోద్వేగమైన కథ అంగ్రేజీ మీడియం చిత్రంలో మాత్రం రాధిక మదన్ యాక్టింగ్ అందర్ని ఆకట్టుకొంటున్నది. ఏకంగా బిగ్‌బీ అమితాబ్ ఈమె నటనపై ప్రశంసలు కురిపించడం గమనార్హం.

ఢిల్లీకి చెందిన అందాల భామ

ఢిల్లీకి చెందిన అందాల భామ

ఇక రాధిక మదన్ వ్యక్తిగత జీవితం గురించి పరిశీలిస్తే.. ఢిల్లీకి చెందిన ఈ అందాల భామ ఓ సంపన్న కుటుంబం నుంచి వచ్చింది. తండ్రి సుజిత్ మదన్ వ్యాపారవేత్త కాగా, తల్లి నీరు మదన్ ఆర్టిస్టుగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదువుకొన్న ఈ బ్యూటీ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ పరిధిలోని జీసస్ అండ్ మేరీ కాలేజ్ నుంచి డిగ్రీ పుచ్చుకొన్నారు. ఆ తర్వాత వినోద పరిశ్రమలోకి ప్రవేశించారు.

తొలుత టెలివిజన్ రంగంలో

తొలుత టెలివిజన్ రంగంలో

తొలుత టెలివిజన్ రంగంలోకి ప్రవేశించిన రాధిక మదన్ మేరి ఆషికీ తుమ్సే హి సీరియల్‌లో నటించింది. ఈ సీరియల్‌లో అద్భుతమైన ప్రతిభ చాటినందుకు ఉత్తమ తొలి టెలివిజన్ సీరియల్ తార స్క్రీన్ అవార్డును సొంతం చేసుకొన్నది. ఆ తర్వాత ఆమెకు అంగ్రేజీ మీడియం రూపంలో తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు బాలీవుడ్ ఆఫర్ దక్కింది.

ఆమె బ్యాంక్ బ్యాలెన్స్

ఆమె బ్యాంక్ బ్యాలెన్స్

ఇక రాధిక మదన్‌ అందంలోను, ప్రతిభలోనే కాదు.. ఆస్తుల్లో కూడా ఆరితేరింది. తన కుటుంబ వారసత్వంగా తన పేరు మీద భారీగానే బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఆమె పేరు మీద అక్షరాల ఒక మిలియన్ డాలర్ ఆస్తులు ఉన్నట్టు ప్రముఖ దిన పత్రిక పేర్కొన్నది. అంటే సుమారుగా ఆమె పేరు మీద రూ.7.3 కోట్ల ఆస్తి ఉన్నట్టు వెల్లడించింది. బాలీవుడ్‌లో యువతారలతో పోల్చుకొంటే రాధిక మదన్ ఆస్తి ఎక్కువే అనే మాట వినిపిస్తున్నది.

Recommended Video

Adi Oka Idi Le Movie Teaser || Filmibeat Telugu
కరోనా దెబ్బతో బాక్సాఫీస్ వద్ద

కరోనా దెబ్బతో బాక్సాఫీస్ వద్ద

భారీ అంచనాలతో మార్చి 13న రిలీజ్ అయిన అంగ్రేజీ మీడియం చిత్రం ప్రేక్షకులను, సినీ విమర్శకులను సంతృప్తిపరిచింది. అయితే భారీ విజయం దిశగా వెళ్తున్న సమయంలో కరోనావైరస్ దెబ్బ ఈ చిత్రంపై పడింది. ప్రాణాంతక వ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమా హాళ్లను నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవడం సినిమాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X