శ్రీదేవీ కోసం ఆస్తులు అమ్మకం.. పీకల్లోతూ అప్పల్లో నిర్మాత.. దర్శకుడు సూసైడ్ అటెంప్ట్.. వాళ్లు ఎవరో తెలుసా?
దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి నటించిన ఓ మూవీని రిలీజ్ చేయడానికి నిర్మాత పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కావు. ఆరు సంవత్సరాలు ఆలస్యమైన ఆ సినిమాను డైరెక్టర్ మధ్యలోనే వదిలేస్తే, నిర్మాత మాత్రం పట్టు వదలకుండా ఆస్తిని అమ్మి మరీ ఆ మూవీని రిలీజ్ చేశాడు. మరి ఇంతకీ నిర్మాతలను ముప్పు తిప్పలు పెట్టిన శ్రీదేవి మూవీ ఏంటి? అనే ఇంట్రెస్టింగ్ విషయాన్నీ తెలుసుకుందాం పదండి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మూవీ 80 చివర్లలో 90 ప్రారంభంలో అత్యంత భారీ బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. కానీ శ్రీదేవికి అనిల్ కపూర్ కి ఆ మూవీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాఫ్ గా నిలిచింది. ఆ మూవీ పేరు రూప్ కి రాణి చోరోన్ కా రాజా. 1987లో వచ్చిన మిస్టర్ ఇండియా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత నిర్మాత బోనీ కపూర్ అదే టీంతో కలిసి డచెస్ అండ్ ది డర్ట్ వాటర్ ఫాల్స్ అనే ఇంగ్లీష్ మూవీ స్పూర్తితో మరో భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ ను రూపొందించాలని డిసైడ్ అయ్యారు.

మిస్టర్ ఇండియా సక్సెస్ పార్టీలోనే రూప్ కి రాణి చోరోన్ కా రాజా అనే మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మిస్టర్ ఇండియా డైరెక్టర్ శేఖర్ కపూర్ ఈ మూవీకి దశకత్వం వహించగా, శ్రీదేవి హీరోయిన్‌గా, అనిల్ కపూర్ హీరోగా నటించారు. 1987లో సెట్స్ పైకి వెళ్ళిన ఈ మూవీ ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ఆరేళ్ల తర్వాత రిలీజ్ అయింది.
అయితే మూవీలో సోల్ మిస్సయింది అంటూ డైరెక్టర్ శేఖర్ సినిమాను సగంలోనే వదిలేశాడు. దీంతో ఆయన అసిస్టెంట్ అయిన దివంగత నటుడు సతీష్ కౌశిక్ మూవీని తెరకెక్కించే బాధ్యతలు తీసుకున్నారు. కానీ రోజురోజుకూ పలు కారణాల వల్ల ఈ మూవీ వాయిదా పడుతూ వస్తూ ఉండటంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది.
సినిమా పూర్తయ్యే నాటికి 10 కోట్ల బడ్జెట్ పెట్టాల్సి వచ్చింది నిర్మాతలు. ఇక 1993లో ఏప్రిల్ 16న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బలహీనమైన కథాంశం కారణంగా డిజాస్టర్ గా మిగిలింది. పది కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ కేవలం 3 కోట్లు మాత్రమే రాబట్టి బాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాగా నిలిచింది.

అయితే బోని కపూర్ ఈ భారీ ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవడానికి ఆస్తులను అమ్ముకోవాల్సి వచ్చింది. మరో ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ మూవీ డిజాస్టర్ కావడంతో డైరెక్టర్ గా వ్యవహరించిన సతీష్ ఎంతగానో కృంగిపోయి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారట. కానీ ఆ తర్వాత అందరూ సర్ది చెప్పడంతో సతీష్ మనసు మార్చుకున్నాడని సమాచారం.
అంతేకాకుండా ఇదంతా తెలుసుకున్న నిర్మాత బోనీ కపూర్ ఆయనకు 1995లో తన తమ్ముడు సంజయ్ కపూర్ ని ప్రేమ్ అనే మూవీతో లాంచ్ చేసే బాధ్యతను అప్పగించారు. మొత్తానికి శ్రీదేవి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ నిర్మాతలను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది.


Click it and Unblock the Notifications











