144 సార్లు పోలీస్ ఇన్స్‌పెక్టర్ పాత్రలో కనిపించిన యాక్టర్ ఎవరో తెలుసా? గిన్నిస్, లిమ్కా రికార్డులతో ఘనత!
సినిమా పరిశ్రమలో ఏదైనా పాత్రలో కనిపించిన నటుడికి ఆ పాత్ర ద్వారా పాపులారిటీ వస్తే.. ఆ యాక్టర్ అలాంటి క్యారెక్టర్లే ఎక్కువ వస్తాయి. కొందరు నటీనటులు అలాంటి పాత్రలకే పరిమితమవుతారు. ఇండస్ట్రీలో చాలా మంది జడ్జీ పాత్రలకు, కానిస్టేబుల్, ఇన్స్‌పెక్టర్ పాత్రలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోతారు. అలా ఓ నటుడు ఏకంగా 144 సినిమాల్లో పోలీస్ ఇన్స్‌పెక్టర్ పాత్రలను పోషించిన ఘనతను సాధించారు. ఆ నటుడు ఎవరు? ఆయన నటించిన చిత్రాలు ఏమిటీ అనే విషయాల్లోకి వెళితే..
బాలీవుడ్ సినిమాలను ఫాలో అయ్యే ప్రేక్షకులకు చిన్న నటుడైనా జగదీష్ రాజ్ పరిచయం ఉండి ఉంటారు. ఆయన అసలు పేరు జగదీష్ రాజ్ ఖురానా. బ్రిటీష్ ఇండియాలోని పాకిస్థాన్‌లో సర్గోదా పట్టణంలో 1928 సంవత్సరంలో జన్మించారు. ఆయన 1939 సంవత్సరంలో బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

హిందీ సినిమా పరిశ్రమలోకి ఏక్ హీ రాస్తా అనే సినిమాతో అడుగుపెట్టిన జగదీష్ రాజ్.. తొలిసారి 1956 సంవత్సరంలో సీఐడీ అనే సినిమాలో పోలీస్ ఇన్స్‌పెక్టర్ వేషాన్ని వేశారు. ఆ తర్వాత వరుసగా 12 O' Clock, మధుమతి, ధూల్ కా ఫూల్ అనే సినిమాల్లో పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. కానూన్, పాస్‌పోర్ట్, బాబే కా చోర్, భూత్ బంగ్లా, బత్తమీజ్, హమ్ రాజ్, జెవెల్ థీఫ్ లాంటి చిత్రాల్లో పోలీస్ వేషాల్లో కనిపించారు.
బాలీవుడ్‌కు జగదీష్ రాజ్ మంచి పేరు తెచ్చిన సినిమాల్లో దీవార్, డాన్, శక్తి, మజ్దూర్, ఇమన్ ధరమ్, గోపిచంద్ జాసూస్, సిల్‌సిలా, ఆయినా, బేషరమ్, కాల పత్తర్, దోస్తానా, ఇంక్విలాబ్,రామ్ తేరి గంగా మెయిలీ, బోల్ రాధా బోల్, లవ్, దీదార్, వీర్తా, జగన్నాథ్ చిత్రాలు ఉన్నాయి.
షఫీ ఇనామ్‌దార్ సినిమాలో నటించిన తర్వాత అత్యధిక పోలీస్ పాత్రల్లో నటించిన యాక్టర్‌గా జగదీష్ రాజ్ పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. ఆ తర్వాత 144 సినిమాల్లో కేవలం పోలీస్ ఇన్స్‌పెక్టర్ పాత్రలను పోషించిన ఏకైక నటుడిగా ఆయన పేరు గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డుల్లోకి చేర్చారు.

జగదీష్ రాజ్ 1939 బాలీవుడ్‌లో తన కెరీర్‌ను 2001 సంవత్సరం వరకు అంటే.. 62 ఏళ్లు నటుడిగా కొనసాగారు. ఆయన నటించిన చివరి చిత్రం కసమ్ అనే చిత్రంలో కూడా సీనియర్ పోలీస్ ఆఫీసర్‌గానే కనిపించడం విశేషంగా చెప్పుకోవాలి. ఇక ఆయన కూతురు అనితా రాజ్ కూడా హీరోయిన్‌గా నటించారు. 2013 సంవత్సరంలో 85 ఏటా ఆయన శ్వాస సంబంధింత వ్యాధితో మరణించారు.
ఇదిలా ఉండగా, జగదీష్ రాజ్ పేరు ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ షోలో ప్రస్తావించారు. అజయ్ దేవగన్, రోహిత్ శెట్టి గెస్టులుగా వచ్చిన ఈ షోలో అత్యధిక సార్లు పోలీస్ ఇన్స్‌పెక్టర్ పాత్రను పోషించిన యాక్టర్ ఎవరు అని అడిగిన ప్రశ్నకు దర్శకుడు రోహిత్ శెట్టి కరెక్ట్‌గా సమాధానం చెప్పారు. దాంతో ఆయన పేరు మీడియాలో వైరల్ అయింది.


Click it and Unblock the Notifications











