సల్మాన్ ఖాన్ పెళ్లి.. ఆ కండీషన్ పెట్టుకున్న బాయ్ జాన్.. అందుకే సింగిల్ గా?

బాలీవుడ్ స్టార్ హీరో, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉంటున్నది సల్మాన్ ఖాన్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సల్మాన్ ఖాన్ కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఇండియాలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి తెలిసిన నటుడు అతను. సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో ఎంతగానో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. 3 దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ బాలీవుడ్ లో యంగ్ హీరోలకు దీటుగా సినిమాలు చేస్తున్నారు.

రీసెంట్ గా సల్మాన్ ఖాన్ సికందర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీలో సల్మాన్ ఖాన్ సరసన స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య 31 ఏళ్ల ఏజీ గ్యాప్ ఉన్నప్పటికీ వెండి తెరపై మాత్రం వీరి కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా స్టడీ గానే వసూళ్లను రాబడుతుంది. అయితే సల్మాన్ ఖాన్ గురించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది. 59 ఏళ్లు ఉన్న సల్మాన్ ఖాన్ ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడం ఒక మిస్టరీగానే మిగిలి ఉంది.

Do You Know why Salman Khan be Single in his life actual Reason is

అయితే బాయ్ జాన్ అసలు పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదు చాలా మందికి తెలియని విషయం. సల్మాన్ ఖాన్ బాలీవుడ్లో మంచి పేరు సంపాదించుకున్నారు. తనకు యాక్టర్స్ తోను ఎంతో ప్రేమపూర్వకంగా, గౌరవంగా, మర్యాద గా మెదులుతారు. మహిళా నటులను కూడా ఎంతగానో గౌరవిస్తారు. ముఖ్యంగా షూటింగ్ స్పాట్ లో వారితో చాలా మర్యాదగా మెదులుతూ ఉంటాడు. సల్మాన్ ఖాన్ వ్యక్తిగతంగా అందరితోనూ మంచి మార్కులు కొట్టేశారు. ఇక సల్మాన్ ఖాన్ చాలామంది హీరోయిన్లతో ఫ్రెండ్షిప్ చేసినప్పటికీ ఎవరిని పెళ్లి చేసుకోలేకపోయారు. పలువురు హీరోయిన్లు తో డేటింగ్ అంటూ అడపాదడప రూమర్లు వచ్చిన అవేవీ పెళ్లి వరకు రాలేకపోయాయి.

అయితే సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోకపోవడానికి ఒక కారణం ఉందని తెలుస్తోంది. అది కూడా స్వయంగా ఆయన తండ్రి సలీం ఖాన్ బయట పెట్టడం ఆసక్తికరంగా మారింది. సల్మాన్ ఖాన్ తాను చేసుకోబోయే అమ్మాయి పూర్తిగా తన కెరీర్ ని వదిలేసి తన తల్లి లాగే ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నారు అంట. తన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని ఆశపడ్డారు అంట. కానీ ఇప్పటివరకు సల్మాన్ ఖాన్ జీవితంలో అలాంటి అమ్మాయి ఒక్కరూ కనిపించలేదని సల్మాన్ ఖాన్ అంటుండే వాడంట. మరోవైపు తన తల్లిదండ్రుల కోసం ఆమె కెరీర్ ని పూర్తిగా వదులుకో అనడం కూడా సరి కాదని భావించే వారంట.

ఇక ఇన్ని ఆలోచనల మధ్య సల్మాన్ ఖాన్ పెళ్లికి దూరంగా ఉన్నారని తెలుస్తుంది. ఇప్పటికీ బ్యాచిలర్ గానే జీవితాన్ని సాగిస్తున్నారు. కుటుంబ సభ్యులతో మాత్రం సమయం దొరికినప్పుడల్లా గడుపుతూ ఉంటారు. అందుకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటారు. ఆరు పదుల వయసుకు దగ్గరికి వచ్చిన సల్మాన్ ఖాన్ ఇక పెళ్లి చేసుకుంటారా లేదా అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్ గా మారింది. ఏదేమైనప్పటికీ బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాలతో ప్రేక్షకులను మాత్రం అలరిస్తున్నారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో కామియో అప్పియరెన్స్ ఇచ్చి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సల్మాన్ ఖాన్ ఎంతో సన్నిహితంగా ఉంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X