శ్రీదేవి మరణ విషాదం.. సోదరి చివరిచూపుకు దూరం.. అంత్యక్రియలకు ఎందుకు హాజరు కాలేదంటై?
దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవిని ఇప్పటికీ అభిమానులు గుండెల్లో ప్రత్యేకంగా గుడి కట్టుకుని ఆరాధిస్తున్నారు. కానీ శ్రీదేవి అంటే ఆమె సోదరికి మాత్రం అస్సలు నచ్చదు. ఆమె అంత్యక్రియలకు కూడా సోదరి హాజరు కాలేదు. మరి చివరి చూపు చూడడానికి కూడా ఇష్టపడనంత పెద్ద తప్పు శ్రీదేవి ఏం చేసింది? అనే ఇంట్రెస్టింగ్ విషయంపై ఓ లుక్కేద్దాం.
మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీదేవి 2018న ఫిబ్రవరి 24న మరణించింది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆమె చనిపోయి దాదాపు 8 ఏళ్లు కావస్తున్నా ఇంకా అభిమానులు ఆమెను తమ ఆరాధ్య దేవతగా కొలుస్తున్నారు.

సౌత్ నుంచి నార్త్ దాకా అప్పట్లోనే శ్రీదేవి తన నటనతో చిత్రపరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆమె కెరీర్ లో దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించింది. వాటిలో చాలావరకు సూపర్ హిట్స్ గా నిలిచి సినిమా ఇండస్ట్రిలో ఆమెను అతిలోక సుందరిగా నిలిపాయి.
ఇక శ్రీదేవి సినిమా కెరియర్ గురించి అందరికీ తెలిసిందే. కానీ ఆమె కుటుంబం లేదా వ్యక్తిగత జీవితం గురించి, ముఖ్యంగా తోబుట్టువుల గురించి పెద్దగా ఎవ్వరికీ తెలియదు అనే చెప్పాలి. రీసెంట్ గా శ్రీదేవి తన సోదరితో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీంతో ఆ ఫోటోని చూసిన నెటిజన్లు శ్రీదేవికి సోదరీ కూడా ఉందా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.శ్రీదేవి సోదరి పేరు శ్రీలత. ఒకప్పుడు శ్రీదేవి తన సోదరితో చాలా సన్నిహితంగా ఉండేది. కానీ వాళ్ళిద్దరి మధ్య డబ్బు అనే మహమ్మారి చిచ్చు పెట్టింది.
నిజానికి శ్రీదేవి సినిమాల్లో హీరోయిన్ గా కెరియర్ ప్రారంభించినప్పుడే శ్రీలత సెట్స్ లో ఆమెకు తోడుగా వచ్చేదట. ఆ తర్వాత ఆమె కూడా హీరోయిన్ కావాలనుకుంది. అప్పట్లో కొన్ని సినిమాల్లో చేసినప్పటికీ సక్సెస్ కాకపోవడంతో శ్రీదేవికి మేనేజర్ గా మారింది.
అయితే ఒకానొక సమయంలో శ్రీదేవి తల్లి మరణించడం కారణంగా వీరిద్దరి బంధంలో పూడ్చలేని గ్యాప్ ఏర్పడింది. 1996లో శ్రీదేవి తల్లి మరణించింది. ఆ తర్వాత శ్రీదేవి తన తల్లి మరణించిన ఆస్పత్రిపై ఫిర్యాదు చేసి పరిహారంగా సుమారు 7.2 కోట్లు అందుకుంది.
అయితే అందులో ఎంతో కొంత సోదరి శ్రీలతకు ఇవ్వకుండా మొత్తం డబ్బును తన దగ్గరే ఉంచేసుకుంది శ్రీదేవి. ఈ పరిణామాలే ఇద్దరు అక్కచెల్లెళ్ల మధ్య బంధం బీటలు వారడానికి దారి తీసింది.
ఆ తర్వాత శ్రీలత తన వాటా డబ్బు కోసం శ్రీదేవిపై ఏకంగా కోర్టులో కేసు వేసింది. అందులో గెలిచి తన వాటాగా 2 కోట్లు కూడా అందుకుంది. కానీ ఇద్దరి మధ్య బంధం మాత్రం మునుపటిలా మారలేదు.
ఈ ఘటనతో విడిపోయిన ఇద్దరు అక్కచెల్లెళ్లు మళ్ళీ ఎప్పుడూ కలవలేదు. కనీసం శ్రీదేవి మరణ వార్త తెలిసిన తర్వాత కూడా శ్రీలత చలించలేదు. అందుకే సోదరి చనిపోయింది అన్న వార్త తెలిసాక కూడా కనీసం ఆమెను చివరి చూపు చూడడానికి కూడా శ్రీలత ఇష్టపడలేదని సమాచారం.


Click it and Unblock the Notifications











