ఒకే సినిమాతో ఇండస్ట్రీకి మిస్ ఇండియా గుడ్‌బై.. వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొన్న షారుక్ హీరోయిన్ ఎవరో తెలుసా?

మిస్ ఇండియా అనేది ఎంతోమంది మోడల్స్ కల. అలాంటి కిరీటాన్ని దక్కించుకున్నాక బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని, హిందీ చిత్ర పరిశ్రమను స్టార్ హీరోయిన్ గా ఏలాలి అని ఎదురు చూస్తుంటారు మోడల్స్. కానీ అంతటి మంచి ఆకాశాన్ని వదులుకుని అంతకంటే అద్భుతమైన లైఫ్ లోకి అడుగు పెట్టింది మిస్ ఇండియా. కానీ ఒకే ఒక్క సినిమా చేసి ఓ వ్యాపారవేత్తను పెళ్లాడి సినీ పరిశ్రమకు గుడ్ బై చెప్పేసింది. మరి ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

గాయత్రి జోషి 1977లో నాగపూర్ లో జన్మించింది. విద్యాభ్యాసం అంతా ముంబైలోనే పూర్తి చేసింది. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు మోడలింగ్ రంగంలోకి కూడా అడుగు పెట్టింది. ఇక మోడల్ గా ఎన్నో సంస్థలతో కలిసి పని చేసిన గాయత్రి అప్పట్లో షారుక్ ఖాన్ తో కలిసి ఒక యాడ్ లో కూడా కనిపించింది.

Do You Know Why Swadesh Heroine Gayatri Joshi quit movies after doing a cinema with Shah Rukh Khan

1999లో గాయత్రి మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత 2000లో మిస్ ఇండియా ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. జపాన్ లో జరిగిన మిస్ ఇంటర్నేషనల్ పోటీల్లో ఈ బ్యూటీ పాల్గొంది.

2004లో మోడల్ గా సక్సెస్ అయిన గాయత్రి స్వదేశ్ అనే హిందీ సినిమాలో నటించింది. ఈ సినిమాలో షారుక్ ఖాన్ హీరోగా నటించారు. ఫస్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. కానీ ఈ సినిమాలో గాయత్రి తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Do You Know Why Swadesh Heroine Gayatri Joshi quit movies after doing a cinema with Shah Rukh Khan
అయితే ఆ తర్వాత వికాస్ ఒబెరాయ్ ని పెళ్లి చేసుకుని సినిమాలను పక్కన పెట్టేసింది. వికాస్ భారత దేశంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్తలలో ఒకరు అన్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైన గాయత్రి తన భర్త వికాస్ తో కలిసి ముంబైలో నివసిస్తోంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళ ఆస్తి దాదాపు 22,780 కోట్లు ఉంటుందని అంచనా.

బాలీవుడ్ హీరోయిన్ గాయత్రి జోషి ఇటీవల ఇటలీలో ఓ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆమె ప్రముఖ వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మిస్ ఇండియా విన్నర్ అయ్యాక ఒకే ఒక సినిమాలో నటించిన బ్యూటీ ఆ తర్వాత సినిమాలకు బైబై చెప్పేసింది. ఇక రీసెంట్ గా ఇటలీలో యాక్సిడెంట్ కారణంగా మరోసారి గాయత్రి పేరు తెరపైకి వచ్చింది. సార్జీనియ సూపర్ కార్ టూర్ లో పాల్గొనడానికి గాయత్రీ, వికాస్ ఇటలీ వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఇటలీలో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.

ఈ ప్రమాదం 2023 చివర్లో జరగ్గా, ఆ సమయంలో ఒక ఫెరారీ ఒక క్యాంపర్‌వాన్ తో పాటు వీళ్ళ కారును ఢీకొట్టింది. మరో కారులో ఉన్న స్విస్ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. అయితే వికాస్, గాయత్రి ఇద్దరూ క్షేమంగా బయట పడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X