సుశాంత్‌ని కిరాతకంగా కొట్టారు.. ఇతర ప్రదేశాల్లో గాయాలు.. వీడియో బయటపెట్టిన డాక్టర్

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఎలా మరణించాడు? అతనిది ఆత్మహత్యా? లేక హత్యా? అనే సందేహాలు రోజురోజుకి మరింత ఎక్కువవుతున్నాయి. సుశాంత్ మరణం వెనుక అసలు నిజాలు తెలియాలని సాధారణం జనం నుంచి టాప్ సెలబ్రెటీస్ వరకు ప్రతి ఒక్కరు బలంగా కోరుకుంటున్నారు. అయితే కేసు విచారణ కూడా ఊహించని మలుపులు తిరుగుతుండడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. ఇక ఇటీవల ఒక డాక్టర్ కూడా వీడియో విడుదల చేయడం మరింత హాట్ టాపిక్ గా మారింది.

అనుమానాలు తగ్గడం లేదు..

అనుమానాలు తగ్గడం లేదు..

మొదటి నుంచి కూడా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు అనే విధంగా ముంబై పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్స్ లో కూడా అతను ఆత్మహత్య చేసుకున్నట్లు బయటపడింది. అయితే ఈ కేసుపై ఇంకా అనుమానాలు తగ్గడం లేదు. ఎవరో ఒకరు పలు ఉదాహరణలు చెబుతూ కేసు మరింత హాట్ టాపిక్ అయ్యేలా చేస్తున్నారు.

ముమ్మాటికీ హత్యే

ముమ్మాటికీ హత్యే

ఇటీవల కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్య స్వామి కొన్ని ఉదాహరణల గురించి చెబుతూ.. సుశాంత్ సింగ్ ది ముమ్మాటికీ హత్యే అని వివరణ ఇచ్చారు. ఆయన చెప్పిమ పాయింట్స్ కూడా సరికొత్త అనుమానాలకు దారి తీస్తున్నాయి. సుశాంత్ మృతి చెందిన రోజు సీసీ టీవీ పని చేయకపోవడం అతని వంటిపై గాయాలు ఉండడం ఇలా చాలా అనుమనాలను బయటపెట్టడం మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది.

వీడియో బయటపెట్టిన డాక్టర్

రాజకీయ నాయకులు, సినీ తారాలే కాకుండా వైద్యులు కూడా ఈ కేసు విషయంలో అనుమానాలు వ్యక్తం చేస్తుండడం మరింత షాక్ కి గురి చేస్తోంది. ఇటీవల మీనాక్షి మిశ్రా అనే ప్రముఖ డేర్మటాలజీ వైద్యురాలు కూడా ప్రస్తుతం వస్తున్న అనుమానాలు నిజమే అనే విధంగా సమర్దించారు. వీడియోలో సుశాంత్ పై మొహం ఉన్న గాయాలను చూపిస్తూ ఆమె ఈ విధంగా వివరణ ఇచ్చారు.

ఆ చోట గాయాలు..

ఆ చోట గాయాలు..

ఒక మనిషి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటే.. కనుగుడ్లు, నాలుక కూడా బయటకు వస్తుంది. కానీ సుశాంత్ మృతి చెందినపుడు అతని విషయంలో ఈ గుర్తులు కనిపించలేదు. ఒక కన్ను మూసుకొని ఉండగా.. మరో కన్ను తెరుచుకొని ఉంది. చేతితో బలంగా కొడితేనే కంటిపై ఆ విధంగా గాయం అవుతుంది.

Recommended Video

Sushant Singh Rajput: Netizens Demands Be Fair In Sushant Case| #BeFairInSSRCase
దారుణంగా కొట్టి చంపారు

దారుణంగా కొట్టి చంపారు

నిజంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనుక ఎదో కారణం ఉంది. ఇది ఆత్మహత్య కాదు. హత్య అని అనిపిస్తోంది. సుశాంత్ ని దారుణంగా కొట్టి చంపారని తెలుస్తోంది. మనల్ని పిచ్చోళ్ళను చేయడానికి ఆత్మహత్యకు చిత్రీకరిస్తున్నారు అనే అనుమానం కలుగుతోంది అంటూ మిశ్రా వివరణ ఇచ్చారు. అదే విధంగా అతన్ని చంపడానికి ముందు మత్తు మందు ఇచ్చి ఉండవచ్చని కూడా ఆమె అనుమానం వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X