స్వలింగ సంపర్కుల కథాంశంతో ఆయుష్మాన్ ఖురానా.. గ్రేట్ అని మెచ్చుకున్న ట్రంప్
Recommended Video

స్వలింగ సంపర్కం అనేది ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు. దీన్ని చట్ట బద్దం చేయాలని వివిద దేశాలకు చెందిన ఎంతోమంది పౌరులు నిరసనలు చేస్తున్నారు. వారి హక్కుల కోసం కొన్ని ప్రత్యేక సంస్థలు కూడా పని చేస్తున్నాయి. లెస్బియన్, గే అంటూ వారిని చిన్న చూడ కూడదని స్వచ్చంద సంస్థలు కోరుతున్నాయి. ఇలాంటి వాటికి సమాజం వ్యతిరేకంగానే నిలుస్తుందన్న విషయం ప్రత్యేకం చెప్పనక్కర్లేదు.

సినిమాల్లో పెరిగిన కల్చర్..
ఈ మధ్య సినిమాల్లో గే, లెస్బియన్స్ పాత్రలను జొప్పించడం చూస్తూనే ఉన్నాం. ఆడవారు ఆడవారిని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం.. మగవారు మగవారినే ప్రేమించం పెళ్లి చేసుకోవడం వంటి కాన్సెప్ట్‌లతో చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్‌లో ఇప్పటికే ఈ తరహా చిత్రాలు క్యూ కట్టాయి.

సోనమ్ కపూర్ సైతం..
ఏక్ లడఖీ కో దేఖాతో ఐసా లగా చిత్రంలో సోనమ్ కపూర్.. మరో అమ్మాయిని ప్రేమిస్తుంది.. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఈ చిత్రం అనుకున్నంతగా విజయం సాధించలేదు కానీ.. సోనమ్ కపూర్‌కు మంచి పేరునే తీసుకొచ్చింది. తాజాగా రిలీజైన ఆయుష్మాన్ ఖురానా చిత్రం గేల చుట్టూ తిరుగుతుంది.

గే కథతో వచ్చిన ఆయుష్మాన్..
గతేడాది అంధాధున్, బదాయి హోతో మంచి విజయాలను అందుకున్న ఆయుష్మాన్ తాజాగా శుభ్‌మంగళ్ జ్యాదా సావధాన్ అంటూ వచ్చాడు. ఇద్దరి మగవారి మధ్య వచ్చే ప్రేమకథతో తెరకెక్కించిన ఈ సినిమా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.
ట్రంప్ ట్వీట్..
‘ఓ భారతీయ చిత్రం శుభ్‌మంగళ్ జ్యాదా సావధాన్ హోమో సెక్సువాలిటీతో.. వివక్షలు ఎదురైనా చివరకు పెద్దవారి మనసులను గెలుస్తాడు. సంతోషంగా ఉంద'ని ఎల్‌జీబీటీ హక్కుల కోసం పోరాటే పీటర్ టాట్చెల్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు స్పందించిన ట్రంప్ గ్రేట్ అంటూ పోస్ట్ చేశాడు.


Click it and Unblock the Notifications











