బురద జల్లితే ఊరుకునేది లేదు... జయాకు మద్దతుగా హేమామాలిని
మూవీ మాఫియా, డ్రగ్ మాఫియా అంటూ బాలీవుడ్ పై విరుచుకుపడుతున్న కంగనకు కౌంటర్ ఇచ్చిన జయా బచ్చన్ కూ క్రమంగా వెటరన్స్ నుంచి మద్దతు లభిస్తోంది. తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమా మాలిని కూడా చేరారు. ఇండస్ట్రీ పై బురద జల్లితే సహించేది లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బాలీవుడ్ పరువును దిగజార్చేందుకు వీలులేదని వ్యాఖ్యానించిన హేమ, ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు బట్టలకు అంటుకున్న మరకలాంటివని, వాటిని కడిగేసుకోవాల్సిందేనని వెల్లడించారు. తనకు ఈ ఇండస్ట్రీ ఎంతో ఇచ్చిందని, అలాంటి పరిశ్రమ గురించి ఎవరన్నా చెడుగా మాట్లాడితే ఎలా ఊరుకుంటానని స్పష్టం చేశారు.

ఎందరో మహానటులు ఈ పరిశ్రమను ముందుకు తీసుకువెళ్లారని తెలిపిన హేమ, తాను ఇంత పేర ప్రఖ్యాతలు సంపాదించుకునేందుకు దోహదపడిందని వ్యాఖ్యానించారు. ఇదొక అందమైన, సృజనాత్మకమైన ప్రపంచమని, సంస్కృతి సంప్రదయాలకు నెలవు అని హేమామాలిని తెలిపారు.


Click it and Unblock the Notifications











