సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో మరో వ్యక్తి అరెస్ట్.. విదేశీయులతో డ్రగ్స్ దందా
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు దర్యాప్తులో భాగంగా తెరపైకి వచ్చిన డ్రగ్స్ రాకెట్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిషేధిత మాదక ద్రవ్యాలను సరఫరా, వినియోగం కేసులో అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
రియాచక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, మరో 19 మందిని అరెస్ట్ చేసిన 16/20 కేసులోనే జై మధోక్‌ను అరెస్ట్ చేయడం గమనార్హం. జై మధోక్ అరెస్ట్‌తో ఈ కేసులో అరెస్ట్ చేసిన వారి సంఖ్య 22కు చేరింది. జై మధోక్‌ను ముంబైలోని శాంతాక్రజ్‌లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేసినట్టు సమాచారం. జై మధోక్ అరెస్ట్ విషయాన్ని ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖేడే ధృవీకరించారు.

డ్రగ్స్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన క్షితిజ్ రవి ప్రసాద్‌తో జై మధోక్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని ఎన్సీబీ పేర్కొన్నది. నైజీరియా వాసుల నుంచి మధోక్ డ్రగ్స్ సేకరించే వారని, వాటిని బాలీవుడ్ నటులకు సరఫరా చేసేవారనే విషయం తాజాగా బయటకు వచ్చింది. పలువురు స్టార్లు మధోక్‌తో టచ్‌లో ఉన్నారనే విషయంపై ఎన్సీబీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో భాగంగా అరెస్టైన రియా చక్రవర్తికి ఇటీవల బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విసయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











