షారుక్ ఖాన్ రేంజ్ అంటే అది.. ప్రపంచ బిలియనీర్స్ సైతం ఆశ్చర్యపోయేలా అరుదైన గౌరవం
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత మంది స్టార్ హీరోలు ఉన్నా కూడా షారుక్ ఖాన్ కి దక్కే క్రేజ్ డిఫరెంట్ గా ఉంటుంది. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఒక విధంగా షారుక్ కంటే అత్యదిక మార్కెట్ సెట్ చేసుకున్నప్పటికి వివిధ దేశాల్లో మాత్రం షారుక్ తన ఉనికిని ఎక్కువగా చాటుకున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే ఇటీవల దుబాయ్ లో ఆయనకి అందిన బర్త్ డే విషెస్ నెవర్ బిఫోర్ అనేలా ఉంది.

అక్కడ కూడా షారుక్ కి భారీ క్రేజ్
షారుక్ ఖాన్ సినిమాలు అరబ్ కంట్రీస్ లో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా దుబాయ్ లో షారుక్ ఖాన్ కి మంచి క్రేజ్ ఉంది. ఇక ఆయన అప్పుడప్పుడు హాలిడేస్ వెకేషన్స్ కి కూడా వెళుతూ ఉంటాడు. అక్కడ ఒక విల్లా కూడా కొనుగోలు చేసినట్లు గతంలో వార్తలు చాలానే వచ్చాయి.
బుర్జ్ ఖలీఫాపై బర్త్ డే విషెస్
ఇక షారుక్ పుట్టినరోజు సందర్భంగా దుబాయ్ లో ఆయనకు ప్రపంచం ఆకర్షించేలా విషెస్ అందించారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా గురించి అందరికి తెలిసే ఉంటుంది. అయితే అలాంటి ప్రముఖమైన దానిపైన షారుక్ కి లేజర్ లైట్స్ తో హ్యాపీ బర్త్ డే షారుక్ అంటూ విషెస్ అందించారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి.

బిలియనీర్స్ కి సైతం దక్కని గౌరవం..
బుర్జ్ ఖాలీఫాపై పేరు కనిపించాలి అంటే వారు అత్యంత ప్రతిభావంతులైన సెలబ్రెటీలు అయ్యి ఉండాలి. బిలియనీర్స్ కి సైతం దక్కని గౌరవం షారుక్ కి దక్కడంతో మరోసారి ఆయన క్రేజ్ ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఇక ప్రస్తుతం ఈ సీనియర్ హీరో దుబాయ్ లోనే ఉన్నాడు. ఐపీఎల్ లో తన టీమ్ కేకేఆర్ కి మద్దతు ఇస్తూ స్టేడియంలో అభిమానిలా ఎంజాయ్ చేస్తున్నాడు.
Recommended Video

నెక్స్ట్ ఎవరితో?
జీరో సినిమాతో డిజాస్టర్ ఎదుర్కొన్న షారుక్ ఖాన్ ఆ తరువాత మరో సినిమా చేయలేదు. దాదాపు రెండేళ్లు కావస్తోంది ఇంకా కొత్త సినిమా ఏమిటనే విషయంలో చిన్న అప్డేట్ కూడా రాలేదు. తమిళ్ దర్శకుడు అట్లీతో 'సంకి' అనే సినిమా చేస్తున్నట్లు టాక్ బాగానే వస్తోంది. దీపికా పదుకొనె హీరోయిన్ అని కథనాలు కూడా వచ్చాయి. కానీ ఇంతవరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రాలేదు. అలాగే రాజ్ కుమార్ హిరానితో కూడా ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నట్లు రూమర్స్ వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











