Dunki First Review షారుక్ మూవీ హిట్టే కానీ.. డైరెక్టర్ టేకింగ్‌పై షాకింగ్‌గా! డంకీ రిపోర్టు ఎలా ఉందంటే?
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, రాజ్ కుమార్ హిరాణి ఫిల్మ్స్, జియో స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం డంకీ. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి దర్వకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. వలస బతుకుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయిలో రిలీజ్ అవుతున్నది. ఈ క్రమంలో ఈ సినిమాపై సోషల్ మీడియాలో వస్తున్న రివ్యూల వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ నటి తాప్సీ పొన్ను, వికీ కౌశల్, బోమన్ ఇరానీ తదితరులు నటించిన ఈ సినిమాకు మురళీధరన్ సీకే, మనుష్ నందన్, కుమార్ పంకజ్ సినిమాటోగ్రఫిని అందిస్తున్నారు. ఈ సినిమాకు ఎడిటింగ్ బాధ్యతలను స్వయంగా రాజ్ కుమార్ హిరాణి భుజానికి ఎత్తుకొన్నాడు. ప్రీతమ్, అమన్ పంత్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇక ప్రమోషన్ కార్యక్రమాలతో షారుక్, రాజ హిరాణి అదరగొట్టారు. డంకీ డ్రాప్ పేరుతో వరుసగా రిలీజ్ చేసిన ప్రోమోలు, ట్రైలర్, పాటలు ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. దాంతో 120 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా కలెక్షన్లపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డ డంకీ సినిమా గురించి క్రిటిక్ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇన్‌సైడ్ రిపోర్టుల వివరాల్లోకి వెళితే.. ఫస్టాఫ్ యావరేజ్ కంటే బెటర్‌గా ఉంటుంది. సెకండాఫ్ అంతా ఎమోషనల్ కంటెంట్‌తో నింపేశారు. షారుక్ ఖాన్ ఫెర్ఫార్మెన్స్ బాగుంటుంది అని క్రిటిక్ కామెంట్ చేశారు.
గతంలో దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. కానీ డంకీ సినిమా విషయానికి వస్తే.. ఆయన కెరీర్‌లో అత్యంత వీకెస్ట్ సినిమా ఇదే కావొచ్చు. కానీ సినిమా డిసెంబర్ 21వ తేదీన రిలీజ్ అవుతున్నది. కాబట్టి అప్పటి వరకు వేచి చూస్తే తప్పా సినిమా ఎలా ఉంటుందో చెప్పడం కష్టం అని అంటున్నారు.

డంకీ సినిమా గురించి నాకు ఉన్న అపోహలు తొలిగిపోయాయి. ఈ సినిమాను సెన్సార్ బోర్డు స్క్రీనింగ్‌లో చూశాను.ఈ సినిమా సూపర్ హిట్ అంటూ క్రిటిక్ ఉమేర్ సంధూ కామెంట్ చేశాడు. అయితే ఉమేర్ బాగున్నాయని చెప్పిన సినిమాలు కొన్ని బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టాయి. దాంతో ఈయన రిపోర్టు నమ్మడం కష్టమే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











