ఇంకో పెళ్లి చేసుకున్నావో.. మీ ఇద్దరిని చంపేస్తా: స్టార్ హీరోకు భార్య వార్నింగ్
భార్య బ్రతికుండగానే కొందరు రెండో పెళ్లి చేసుకోవడమో, లేదంటే మరో స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకుంటారు. ఇవి కొన్నిసార్లు బెడిసికొట్టి ఏకంగా ప్రాణాలనే బలితీసుకుంటాయి. అందుకే ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా రాముడు మంచి బాలుడిలా భార్యాపిల్లలను చూసుకుంటే జీవితం స్వర్గంలా ఉంటుంది. కానీ కొందరు మగాళ్ల బుద్ధి కుక్క తోక మాదిరి వంకరే. భార్య ఎంత సుఖ పెడుతున్నా.. ఇంకెదో కావాలని తపించి పోతారు కొందరు.
ఇకపోతే.. చిత్ర పరిశ్రమలో హీరో హీరోయిన్ల మధ్య ఎఫైర్లు, ప్రేమలు, విడాకులు కామన్. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి ఎందరో జంటల బాగోతాలను జనం విన్నారు, చూశారు, ఇంకా చూస్తూనే ఉన్నారు. మనిషిలో మార్పు రావాల్సిందే తప్పించి ఎంత మొత్తుకున్నా షరా మామూలే. ఇండస్ట్రీలో ఇద్దరు పెళ్లాల బాగోతాలు ఎక్కువే. ఇందుకు రకరకాల కారణాలు.. ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్లది, దానిని క్వశ్చన్ చేసే రైట్ ఎవ్వరికి లేదు.. వారి వారి జీవిత భాగస్వాములకు తప్ప.

హిందీ చిత్ర సీమలో ఖాన్ త్రయాన్ని, కపూర్లను ఢీకొట్టి తన ప్రతిభ, స్వయంకృషితో స్టార్‌గా ఎదిగారు అక్షయ్ కుమార్. హిట్టు, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ఏడాదికి మూడు నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తూ ఎంతోమందికి చేతినిండా పని కల్పిస్తున్నారు అక్షయ్. మూడున్నర దశాబ్థాలుగా భారతీయ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ఆయన అపజయాలకు కుంగిపోకుండా, విజయాలకు పొంగిపోకుండా ప్రేక్షకులను అలరిస్తున్నారు. తనను ఇంతటి వాడిని చేసిన భారతదేశానికి ఎంతో కొంత తిరిగివ్వాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలకు భారీగా విరాళాలు ఇస్తుంటారు అక్షయ్.
తండ్రి ఆర్మీ ఉద్యోగి కావడంతో దేశభక్తి పాళ్లు ఆయనలో కాస్త ఎక్కువ. ఈ క్రమంలోనే సైనికులు, పోలీసులు, ఇతర సాయుధ బలగాల కుటుంబాలకు అండగా నిలుస్తుంటాడు. బాలీవుడ్ దిగ్గజం రాజేష్ ఖన్నా కుమార్తె, సినీనటి ట్వింకిల్ ఖన్నాను అక్షయ్ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఆరావ్ కుమార్ అనే కుమారుడు ఉన్నారు. భార్య అంటే ఆయనకు ఎంతో అభిమానం. మొన్నామథ్య లండన్ యూనివర్సిటీ నుంచి ఫిక్షన్ రైటింగ్‌లో పట్టా పొందిన ట్వింకిల్‌ను అక్షయ్ ఆకాశానికెత్తేశాడు.
ఇదిలాఉండగా.. ఇటీవల భర్త అక్షయ్ కుమార్‌తో కలిసి వెళ్లిన టూర్ విశేషాలను ట్వింకిల్ తన బ్లాగ్‌లో పంచుకున్నారు. ఓ ఏరియాలో తామిద్దరం సేద తీరుతుండగా.. మా గైడ్ అక్కడికి వచ్చిన రెండు పక్షుల గురించి వివరించారని.. వాటిని టిక్ టిక్ బర్డ్స్ అంటారని, నిజమైన ప్రేమకు అవి నిలువెత్తు నిదర్శనమని చెప్పాడని ట్వింకిల్ తెలిపారు. ఈ రెండింటిలో ఒక పక్షి చనిపోతే, మరో పక్షి ఒంటరిగా ఉండలేక విషపూరితంగా ఉండే ఒకరకమైన గడ్డిని తిని ఆత్మహత్య చేసుకుంటుందని గైడ్ వివరించారని ఆమె వెల్లడించారు.
ఈ విషయాన్ని అక్షయ్‌తో చెబుతూ.. నేను గనుక చనిపోతే నువ్వు కూడా ఆ పక్షి మాదిరే విషపూరితమైన గడ్డి తిను, అలా కాకుండా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, నేను మీ ఇద్దరిని వెంటాడతానని అన్నట్లు ట్వింకిల్ చెప్పారు. దాంతో షాకైన అక్షయ్.. ఆ మాటలు వినకుండా ఉండేందుకు తక్షణం ఆ గడ్డిని తినేస్తానని చెప్పడంతో ఇద్దరం నువ్వుకున్నట్లు ఆమె తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ట్వింకిల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











