బాలీవుడ్ హీరో మెడకు బిగుస్తున్న ఈడీ ఉచ్చు.. త్వరలోనే అధికారుల విచారణ
మనీ లాండరింగ్ కేసులో రాజ్ కపూర్ ముని మనవడు, నటుడు అర్మాన్ జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) అధికారులు ప్రశ్నించనున్నాు. ఆర్థిక లావాదేవీల అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న అర్మాన్‌ను విచారించి పలు ప్రశ్నలకు సమాధానం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది.
జాతీయ వార్త ఏజెన్సీతో ఈడీ అధికారులు మాట్లాడుతూ.. మనీ లాండరింగ్ కేసులో కొన్ని డబ్బు ట్రాన్సాక్షన్స్ గురించి సమాచారం సేకరించేందుకు అర్మాన్‌ను ప్రశ్నించనున్నాం అని తెలిపారు.

ఇదిలా ఉండగా, ఈ కేసులో అర్మాన్ జైన్ ఇంటిలో ఫిబ్రవరి 2021 9వ తేదీన ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అదే రోజు రాజ్ కపూర్ తనయుడు రాజీవ్ కపూర్ ఆకస్మిక మరణం సంభవించడంతో అర్మాన్ జైన్ ఇంటిలో సోదాలు ఆపివేశారు. ముంబైలోని అల్టామౌంట్ రోడ్ ప్రాంతంలొని ఇంటిలో రెండు గంటలపాటు సోదాలు కొనసాగాయి.
ఈ కేసులో అర్మాన్ జైన్‌తోపాటు శివసేన ఎమ్మెల్యే కుమారులను కూడా విచారిస్తున్న సంగతి తెలిసిందే.
రాజ్‌కుమార్ సినీ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. 2014లో లేకర్ హమ్ దీవానా దిల్ హిందీ చిత్రంలో నటించారు.


Click it and Unblock the Notifications











