twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రియా చక్రవర్తి 9 గంటలు ఈడీ అదుపులో.. డొంక తిరుగుడు జవాబిస్తే అరెస్టే అంటూ..

    |

    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానిత సూసైడ్‌కు సంబంధించిన కేసులో ఆయన ప్రియురాలు రియా చక్రవర్తిని ఈడీ అధికారులు శుక్రవారం సుదీర్ఘంగా ప్రశ్నించారు. బ్యాంక్ అకౌంట్లు, ముంబైలో విలువైన ఆస్తులు, కంపెనీల ఏర్పాటు లాంటి అంశాలపై నిశితంగా ప్రశ్నల వర్షం కురిపించగా వాటికి కొంత అసహనంతో సమాధానం చెప్పినట్టు వార్తలు వచ్చాయి. శుక్రవారం నాటి విచారణలో చోటుచేసుకొన్న విషయాలకు సంబంధించి మరిన్నీ విషయాలు..

    Recommended Video

    Sushant Singh Rajput : Rhea Chakraborty ED Interrogation ఈడీ ప్రశ్నలకు రియా చక్రవర్తి అసహనం !
    మధ్నాహ్నం 12 గంటల నుంచి రాత్రి వరకు

    మధ్నాహ్నం 12 గంటల నుంచి రాత్రి వరకు

    ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ అధికారులు ఆదేశాలతో రియా చక్రవర్తి ఈడీ కార్యాలయానికి ఉదయం 11.50 గంటలకు చేరుకొన్నారు. అప్పటి నుంచి ప్రారంభమైన విచారణ రాత్రి 8.45 గంటల వరకు సాగింది. సుమారు 9 గంటలపాటు మనీలాండరింగ్, ఫెరా నిబంధనల ఉల్లంఘన, సుశాంత్‌తో రియా, ఆమె సోదరుడు షోవిక్ బిజినెస్ వ్యవహారాలు, బిజినెస్ మేనేజర్‌ శృతి మోదీని కూడా ఈ కేసులో ప్రశ్నించారు.

    ఈడీ ప్రశ్నలకు అసహనం అంటూ

    ఈడీ ప్రశ్నలకు అసహనం అంటూ

    అంతేకాకుండా రియా చక్రవర్తి పన్ను చెల్లింపు పత్రాలు, పెట్టుబడులు, ఆదాయ వనరులు, బిజినెస్ డీల్స్, ప్రొఫెషనల్ డీల్స్ గురించి కూడా ఆరా తీసినట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈడీ అధికారుల పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారని, కొన్ని ప్రశ్నలకు అసహనం వ్యక్తం చేయడం లాంటివి చేశారని పేర్కొన్నారు.

    సుశాంత్ అకౌంట్ నుంచి 15 కోట్లు

    సుశాంత్ అకౌంట్ నుంచి 15 కోట్లు


    జూలై 31వ తేదీన సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నాలో దాఖలు చేసిన పిటిషన్‌లో రూ.15 కోట్లు బ్యాంక్ నుంచి బదిలీ అయ్యాయని ఆరోపించారు. ఈ క్రమంలో రాజ్‌పుత్ స్థాపించిన నాలుగు కంపెనీల గురించి ఈడీ అధికారులు సమాచారాన్ని అడిగి తెలుసుకొన్నట్టు తెలిసింది. అయితే రెండు కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. మరో రెండు కంపెనీలు రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో ఉన్నాయి అని రియా చెప్పినట్టు తెలిసింది.

    డొంక తిరుగుడు సమాధానాలిస్తే..

    డొంక తిరుగుడు సమాధానాలిస్తే..

    రియా చక్రవర్తి విచారణపై సుశాంత్ ఫ్యామిలీ తరఫు న్యాయవాది వికాస్ సింగ్ మాట్లాడుతూ.. ఈడీ దర్యాప్తుకు ఎట్టకేలకు స్పందించారు. ఈ విచారణలో అధికారులు వేసే ప్రశ్నలకు డొంక తిరుగుడు సమాధానాలిస్తే అరెస్ట్ చేసే వాళ్లే. ఇంకా సుశాంత్ బ్యాంక్ అకౌంట్ల దుర్వినియోగంపై లోతైన విచారణ జరగాలి అని అన్నారు.

    సిద్ధార్థ పితానికి ఈడీ పిలుపు

    సిద్ధార్థ పితానికి ఈడీ పిలుపు

    శుక్రవారం జరిగిన విచారణలో రియాతోపాటు, ఆమె తండ్రి ఇంద్రజిత్, సోదరుడు షోవిక్ బిజినెస్ వ్యవహారాలు, బిజినెస్ మేనేజర్‌ శృతి మోదీని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇక శనివారం సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ పితానిని ఈడీ విచారించనున్నది. ఇప్పటికే సుశాంత్ చార్డెట్ అకౌంట్‌ను విచారించిన సంగతి తెలిసిందే.

    English summary
    ED rejects Rhea Chakraborty plea over Sushant Singh Rajput related PMLA case: Sushant Singh Rajput Case: Sushant Singh Rajput father KK Singh alleges Rhea Chakraborty exploited financially. In this occassion, ED questioned Rhea Chakraborty plea over Sushant Singh Rajput related PMLA case for 9 hours.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X