మేనేజర్‌తో రియా కుట్రలు.. సుశాంత్ సొమ్ముతో భారీగా ఆస్తులు? ఈడీ ప్రశ్నల వర్షం

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో భాగంగా ఆయన బ్యాంక్ అకౌంట్లలో జరిగిన అవకతవకలుపై దర్యాప్తు చేయడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. బుధవారం సుశాంత్ హౌస్ మేనేజర్ శ్యాముల్ మిరాండాను విచారించింది. బ్యాంక్ అకౌంట్లు, ఇంటి వ్యవహారాల గురించి ప్రశ్నించినట్టు తెలిసింది. ఈడీ విచారణ గురించి వివరాల్లోకి వెళితే..

Recommended Video

Sushant Singh Rajput : రియా పై ఈడీ విచారణ.. సుశాంత్ డబ్బుతో భారీ భవంతులు ! || Oneindia Telugu
సుశాంత్ సింగ్ తండ్రి ఫిర్యాదుతో

సుశాంత్ సింగ్ తండ్రి ఫిర్యాదుతో

సుశాంత్ మరణం తర్వాత మేనేజర్ శ్యాముల్ మిరాండా కనిపించకుండా పోయారు. ఆయన అదృశ్యం కావడం అనేక అనుమానాలకు దారి తీసింది. ఈ క్రమంలో సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదుతో బుధవారం విచారణకు హాజరుకావాలని ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే బుధవారం విచారణకు హాజరుకాకపోవడం కూడా సందేహాలు రేకెత్తించింది. గురువారం ఆయన విచారణకు హాజరవ్వడం గమనార్హం.

మేనేజర్‌ను ప్రశ్నించిన ఈడీ అధికారులు

మేనేజర్‌ను ప్రశ్నించిన ఈడీ అధికారులు

గతంలో ఉండే మేనేజర్‌ను మార్చి ఆయన స్థానంలో శ్యాముల్ మిరాండాను రియా చక్రవర్తి నియమించింది. తన బదులుగా మిరాండా ఆర్థిక వ్యవహారాలను చూసుకొనే విధంగా రియా ప్లాన్ చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో రూ.15 కోట్లు మరో అకౌంట్‌కు తరలించారనే విషయం వెలుగులోకి వచ్చింది.

సుశాంత్ మూడు కంపెనీల ఆర్థిక లావాదేవీలపై నజర్

సుశాంత్ మూడు కంపెనీల ఆర్థిక లావాదేవీలపై నజర్

ఇలాంటి వ్యవహారాలే కాకుండా రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో కలిసి సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ మూడు కంపెనీలు స్థాపించారు. వాటికి బదిలీ చేసిన నిధుల గురించి ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో రియాను కూడా ఆగస్టు 7వ తేదీన ఈడీ అధికారులు విచారణకు హాజరుకావాలంటూ సమన్లు జారీ చేయడం సంచలనం రేపుతున్నది.

రియా వార్షిక ఆదాయం చేస్తే షాకింగ్‌గా

రియా వార్షిక ఆదాయం చేస్తే షాకింగ్‌గా

తన కుమారుడు సుశాంత్ సింగ్ డబ్బును రియా చక్రవర్తి దుర్వినియోగం చేసింది. ముంబైలో రెండు ఖరీదైన ఆస్తులను కొనుగోలు చేసి మోసాలకు పాల్పడింది అంటూ తండ్రి కేకే సింగ్ బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆమె పన్ను రికార్డులను తనిఖీ చేయగా గత కొద్ది సంవత్సరాల్లో రూ. 10 లక్షల నుంచి 14 లక్షల మేరకు వార్షిక ఆదాయం పెరిగింది. కేవలం 4 లక్షల మేరకే ఆదాయం పెరిగిన క్రమంలో ఆదాయానికి మించి ఆస్తులు ఎలా కూడబెట్టారనే విషయాన్ని అధికారులకు ఆరా తీస్తున్నారు.

4 లక్షల ఆదాయం పెరిగితే.. ఆస్తులేలా?

4 లక్షల ఆదాయం పెరిగితే.. ఆస్తులేలా?

రియా కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలపై ఈడీ అధికారులు దృష్టిపెట్టారు. కేవలం 4 మేర పెరిగిన ఆదాయంతో భారీ మొత్తంలో ఆస్తులను ఎలా కొనుగోలు చేసిందనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే తల్లితో పేరుతో పాటు రియా చక్రవర్తి జాయింట్ బ్యాంక్ అకౌంట్‌తోపాటు పలు అకౌంట్లను తనిఖీ చేస్తున్నారు. ఢిల్లీలో షోవిక్, రియా డైరెక్టర్లుగా ఉన్న కంపెనీ లావాదేవీలపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X