ఆ పప్పులు ఇక ఉడకవు.. రియా చక్రవర్తికి ఈడీ ఝలక్.. సిద్ధార్థ పితానికి బిగుస్తున్న ఉచ్చు!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డబ్బు అక్రమాలకు సంబంధించిన కేసులో విచారణకు హాజరుకావాలని జారీ చేసిన ఆదేశాలకు భిన్నంగా హీరోయిన్ రియా చక్రవర్తి స్పందించారు. సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నాలో దాఖలు చేసిన కేసును ముంబైకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ‌పై విచారణ జరుగుతున్నందున్న తనను విచారణను నుంచి కొద్ది రోజులు వరకు మినహాయించాలని చేసిన రిక్వెస్ట్‌ను అధికారులు తోసిపుచ్చారు. దాంతో ఆమె ఈ కేసులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ విచారణకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ముంబైలో ఖరీదైన ఆస్తుల కొనుగోలు

ముంబైలో ఖరీదైన ఆస్తుల కొనుగోలు

ఈడీ దర్యాప్తులో రియా చక్రవర్తికి సంబంధించిన సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ముంబైలోని ప్రధాన ప్రాంతంలో ఆమె రెండు ఖరీదైన ఆస్తులను కొనుగోలు చేసినట్టు సమాచారం. అయితే రియా ఆస్తుల కొనుగోలుకు ఆదాయానికి తీవ్ర వ్యత్యాసం ఉండటం చర్చనీయాంశమవుతున్నది. గత నాలుగేళ్లలో రియా వార్షిక ఆదాయం 10 లక్షల నుంచి 12 లక్షల రూపాయలకు పెరగడం గమనార్హం. దీంతో ఆమె ఆర్థిక లావాదేవీలపై సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు.

విచారణ నుంచి మినహాయించాలని రియా చక్రవర్తి అభ్యర్థన

విచారణ నుంచి మినహాయించాలని రియా చక్రవర్తి అభ్యర్థన

తన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యేంత వరకు ఆస్తుల అవకతవకల కుంభకోణంలో తనను మినహాయించాలని చేసిన రిక్వెస్ట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ అధికారులు తిరస్కరించారు. రియా పంపిన ఈమెయిల్‌ లేఖకు బదులిస్తూ తాము సమన్లలో పేర్కొన్న విధంగా ఆగస్టు 7వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందే అంటూ తాజా ఆదేశాల్లో పేర్కొన్నారు.

విచారణకు హాజరవుతుందా? లేదా?

విచారణకు హాజరవుతుందా? లేదా?

ఇక ఈడీ ఆదేశాల ప్రకారం శుక్రవారం (ఆగస్టు 7వ తేదీ)న రియా విచారణకు హాజరుకావాల్సింది. అయితే రియా ఈ విచారణకు హాజరవుతుందా లేదా డుమ్మా కొడుతుందా అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకవేళ రియా హాజరుకాకపోతే ఈడీ ఎలా స్పందిస్తునే వ్యవహారంపై ఆసక్తి నెలకొన్నది.

సుశాంత్ హౌజ్ మేనేజర్‌ను 9 గంటలపాటు విచారణ

సుశాంత్ హౌజ్ మేనేజర్‌ను 9 గంటలపాటు విచారణ

ఇక ఇదే కేసులో రియా చక్రవర్తి సన్నిహితుడు, సుశాంత్ హౌజ్ మేనేజర్ శ్యామ్యూల్ మిరాండాను ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. గురువారం ఆయనను సుమారు 9 గంటలపాటు పలు విషయాలపై గుచ్చి గుచ్చి ప్రశ్నించినట్టు సమాచారం. విచారణ అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా దురుసుగా ప్రవర్తిస్తూ వెళ్లిపోయారు.

Recommended Video

Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
 సిద్ధార్థ పితానికి, శృతి మోడీకి సమన్లు

సిద్ధార్థ పితానికి, శృతి మోడీకి సమన్లు

సుశాంత్ బ్యాంక్ అకౌంట్లు, డబ్బు దుర్వినియోగం కేసులో ఆయన స్నేహితుడు సిద్ధార్థ్ పితానికి ఉచ్చు బిగుస్తున్నది. ఆయనను కూడా విచారించాలని ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. పితానితోపాటు మాజీ బిజినెస్ మేనేజర్ శృతి మోదీకి తాజాగా విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈడీ ఆదేశాల ప్రకారం వారిద్దరూ శనివారం 8 తేదీన ఈడీ అధికారుల ముందు హాజరుకావాల్సి ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X