అమాయకురాలిని, నాకేం తెలియదు.. రియా చక్రవర్తి, ఫ్యామిలీ తీరుపై ఈడీ సీరియస్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో సంబంధమున్న మనీలాండరింగ్ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తి, ఆమె కుటుంబాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) రెండోసారి 9 గంటలపాటు ప్రశ్నించింది. సోమవారం నాడు రియా తండ్రి ఇంద్రజిత్, సోదరుడు షోవిక్ చక్రవర్తితోపాటు సుశాంత్ స్నేహితుడు సిద్దార్థ్ పితాని, రియా మాజీ మేనేజర్ శృతి మోదీని సుదీర్ఘంగా విచారించారు. ఈ కేసులో రియాను రెండోసారి, షోవిక్ చక్రవర్తిని మూడోసారి విచారించడం గమనార్హం. అయితే ఈడీ అధికారులు విచారణ గురించి మీడియాకు వివరిస్తూ..

కాల్ డేటా ఆధారంగా ప్రశ్నలు

కాల్ డేటా ఆధారంగా ప్రశ్నలు

బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులు, ఇతరులను బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బు ట్రాన్స్‌ఫర్, భారీగా ఖర్చులు చేసినట్టు లభించిన ఎలక్ట్రానిక్ సాక్ష్యాల ఆధారంగా సోమవారం ప్రశ్నించాం. అలాగే రియా తన తండ్రి, సోదరుడితో ఫోన్‌లో మాట్లాడిన సంభాషణ గురించి కూడా అడిగి తెలుసుకొన్నాం అని ఈడీ అధికారులు వెల్లడించారు.

ఆస్తుల కొనుగోలు, డబ్బు ట్రాన్స్‌ఫర్ గురించి

ఆస్తుల కొనుగోలు, డబ్బు ట్రాన్స్‌ఫర్ గురించి

రియా చక్రవర్తి 2011 నుంచి కూడబెట్టిన ఆస్తులు, కొనుగోలు చేసిన భవనాల గురించి లోతుగా ప్రశ్నించాం. అలాగే సుశాంత్ స్థాపించిన కంపెనీలో భాగస్వామిగా ఉండటంపై కొన్ని ప్రశ్నలు అడిగాం. పలు సందర్భాల్లో ప్రశ్నలకు రియా తప్పించుకొనే ప్రయత్నం చేశారు. పలు సందర్భాల్లో తాను అమాయకురాలిని అంటూ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. సుశాంత్ కంపెనీలో లక్ష రూపాయల పెట్టుబడి పెట్టి తాను, తండ్రి, సోదరుడు భాగస్వాములుగా చేరామని చెప్పారు అని ఈడీ అధికారులు పేర్కొన్నారు.

ముంబైలో రెండు భవనాల కొనుగోలుపై

ముంబైలో రెండు భవనాల కొనుగోలుపై

ముంబైలోని ఈస్ట్ ఖర్ ప్రాంతంలో రియా, ఆమె కుటుంబ సభ్యులు రెండు ప్రాపర్టీలు కొనుగోలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కొనుగోలు చేయడంపై ప్రశ్నిస్తే.. 20 లక్షల రూపాయలు చెల్లించాం.. మిగితా 60 లక్షల రూపాయలను లోన్‌గా తీసుకొన్నామని రియా చెప్పారు. అయితే ఈ ఆస్తుల కొనుగోలు వ్యవహారంపై లోతైన దర్యాప్తు చేస్తున్నాం అని ఈడీ అధికారులు తెలిపారని డీఎన్ఏ తన కథనంలో పేర్కొన్నది.

Recommended Video

Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
రియా, ఆమె కుటుంబపై తీరుపై ఈడీ ఆగ్రహం

రియా, ఆమె కుటుంబపై తీరుపై ఈడీ ఆగ్రహం

రియా, ఆమె కుటుంబ సభ్యులను సోమవారం 9 గంటలపాటు ప్రశ్నించాం. అయితే రియా నుంచి గానీ, ఆమె కుటుంబ సభ్యుల నుంచి గానీ సరైన సమాధానాలు రాలేదు. పలుమార్లు సమాధానాలు దాటవేసేందుకు ప్రయత్నించారు. రియా నుంచి వచ్చిన సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయి. ఈ కేసు విచారణ కోసం మరోసారి రియా, ఆమె కుటుంబ సభ్యులను పిలుస్తాం అని అధికారులు చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X