twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈడీ చేతికి రియా, తండ్రి కాల్‌డేటా..15 కోట్లతోనే చిక్కంతా.. పొంతనలేని లెక్కలతో బిగుస్తున్న ఉచ్చు

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసుతో సంబంధమున్న ఆర్థిక వ్యవహారాల కేసులో ఈడీ దర్యాప్తు జోరు కొనసాగుతున్నది. వరుసగా ఒక్కక్కరిని ప్రశ్నిస్తూ లెక్కలు తేల్చే పనిలో పడింది. శుక్రవారం రియాను తొమ్మిది గంటలపాటు ప్రశ్నించిన అధికారులు సోమవారం మరోసారి రియాను విచారణకు పిలిచింది. ఈడీ అధికారులు సోమవారం వెల్లడించినట్టు బాలీవుడ్ మీడియా చెప్పున్న కథనంలో..

    Recommended Video

    Sushant Singh Rajput : Rhea Chakraborty Shares Picture Of Gratitude List From Sushant's Dairy
     రియా చక్రవర్తి చెప్పిన లెక్కలతో చిక్కులు

    రియా చక్రవర్తి చెప్పిన లెక్కలతో చిక్కులు

    సుశాంత్ చార్టెట్ అకౌంటెంట్‌ను విచారించిన సమయంలో వెల్లడించిన విషయాలు రియా చెప్పిన లెక్కలకు పొంతన కుదరలేదని, అందుకే మరోసారి రియాను సోమవారం మరోసారి విచారించాలని ఈడీ అధికారులు నిర్ణయించారు. అయితే సోమవారం రియా కుటుంబాన్ని మొత్తం విచారణకు పిలువడం ఈ కేసు తీవ్రత ఎంటో అధికారులు తెలియజెప్పారు.

     సీఏ చెప్పేది ఒకటి.. రియా చెప్పేది మరొకటి

    సీఏ చెప్పేది ఒకటి.. రియా చెప్పేది మరొకటి

    సుశాంత్ బ్యాంక్ అకౌంట్ నుంచి విత్‌డ్రా చేసిన సొమ్ము విషయంలో రియా చెప్పిన అనేక విషయాలు అనుమానాస్పదంగా ఉన్నాయి. రియా చెప్పిన విషయాలు.. సీఏ చెప్పిన విషయాలకు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. నాలుగు కంపెనీలకు సంబంధించిన వ్యవహారాలపై అస్పష్టత ఉందనే విషయాన్ని ఈడీ వర్గాలు పేర్కొన్నట్టు సమాచారం.

     అంతా 15 కోట్ల చుట్టే చిక్కంతా..

    అంతా 15 కోట్ల చుట్టే చిక్కంతా..

    సుశాంత్ అకౌంట్ నుంచి ట్రాన్స్‌ఫర్ అయిన రూ.15 కోట్ల గురించి రియాను రకరకాల ప్రశ్నలు వేసినట్టు తెలిసింది. అయితే కంపెనీలకు సంబంధించిన ఐపీ అడ్రస్‌లు పలుమార్లు మార్చడం అత్యంత అనుమానాస్పదమైంది. ఇలాంటి విషయాలపై ఈడీ లోతుగా విచారించేందుకు సిద్దమవుతున్నట్టు సమాచారం.

    17 సార్లు ఐపీ అడ్రస్ మార్పి..

    17 సార్లు ఐపీ అడ్రస్ మార్పి..

    ఇక సుశాంత్ స్థాపించబోయే కంపెనీల ఐపీ అడ్రస్‌ల వ్యవహారంపై ఇప్పుడు చర్చనీయాంశమైంది. నవీ ముంబైలోని కంపెనీ ఐపీ అడ్రస్‌ను గతేడాది 17 సార్లు మార్చినట్టు తాజా దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. తాజాగా ఆగస్టు 7వ తేదీన చివరిసారిగా ఐపీ అడ్రస్‌ను మార్చడంపై అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారని తెలిసింది.

    రియా, ఇంద్రజిత్ కాల్ డేటా ఈడీ చేతికి

    రియా, ఇంద్రజిత్ కాల్ డేటా ఈడీ చేతికి

    నవీ ముంబైలోని కంపెనీ కోసం జరిపిన లావాదేవీలకు సంబంధించిన డిజిటల్‌ సాక్ష్యాలను ఈడీ ఇప్పటికే సేకరించిందని, వాటి ఆధారంగా రియా తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తిని, ఈ కంపెనీలో కీలకంగా వ్యవహరిస్తున్న సోదరుడు షోవిక్ చక్రవర్తిని ఈ విషయంలో లోతుగా విచారిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే రియాకు తండ్రికి మధ్య సంభాషణ కోసం కాల్ డేటాను అధికారులు సేకరించినట్టు తెలుస్తున్నది.

    English summary
    ED questions Rhea Chakraborty: Sushant Singh Rajput's Navi Mumbai Company IP address changed 17 times: Sushant Singh Rajput Case: Sushant Singh Rajput father KK Singh alleges Rhea Chakraborty exploited financially. KK Singh has filed an FIR against Rhea Chakraborty in Rajiv Nagar Police station in Patna. In this occassion, In this occassion, ED questions Samuel Miranda, Rhea Chakraborty's Properties under scanner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X