హీరోయిన్‌కు వింత ప్రపోజల్.. తనకూ అలాంటి మెసెజ్ వచ్చిందంటోన్న నటి
హీరో, హీరోయిన్లకు అభిమానుల నుంచి ప్రపోజల్స్ రావడం సర్వ సాధారణమైన విషయమే. కొందరు హీరోయిన్లు అయితే ఫ్యాన్స్ నుంచి వచ్చిన అటువంటి ప్రపోజల్స్‌ను అపురూపంగా చూసుకుంటారు. ఒకప్పుడైతే లెటర్స్ ద్వారా మాత్రమే అలాంటి ప్రపోజల్స్ చేసేవారు కానీ ప్రస్తుతం మారిన కాలమాణం ప్రకారం అప్‌డేట్ అయ్యారు. సోషల్ మీడియాను వాడుకుని తమ తమ అభిమాన తారకు తమ ప్రేమ విషయాన్ని చెబుతున్నారు. అలాంటి ఓ వింత ప్రపోజల్ బాలీవుడ్ హీరోయిన్ చెంతకు చేరింది. ఆ ప్రపోజల్‌తో పాటు హీరోయిన్ ఇచ్చిన రిప్లై, ఆ రిప్లైపై ఓ నటి చేసిన కామెంట్ కూడా తెగ వైరల్ అవుతోంది.
హీరోయిన్ తిలోత్తమ షోమ్ మన్‌సూన్ వెడ్డింగ్‌తో బాలీవుడ్‌కు పరిచయమైంది. నటనకు ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించి తిలోత్తమ మంచి గుర్తింపు సంపాదించుకుంది. సర్, చింటూ కా బర్త్ డే, కిస్సా, మెంటల్‌హుడ్ వంటి సినిమాలతో క్రేజ్ తెచ్చుకుంది. ఆ భామకు 'మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నా. మీరు నన్ను పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉంటారా? నేను వర్జిన్. అలాగే వెజిటేరియన్‌ను. లై డిటెక్టర్ టెస్టు, నార్కో టెస్టు, వర్జినిటీ టెస్టు, బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టు చేయించుకోడానికి సిద్ధంగా ఉన్నాన'ని మెసేజ్ చేశాడు.

ఇక తిలోత్తమ సదరు అభిమాని పంపిన సందేశాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ మేరకు బ్రదర్ జోక్ చేస్తున్నావా? అవసరం లేదు. బై బై అంటూ రిప్లై ఇచ్చింది. తిలోత్తమ ఇచ్చిన రిప్లై నటి ఈషా చోప్రా రియాక్ట్ అవుతూ.. 'డ్యూడ్ నాకు కూడా సేమ్ మెసెజ్ వచ్చింది'అంటూ కామెంట్ చేసింది. మొత్తానికి తిలోత్తమ చేసిన పోస్ట్, ఈషా ఇచ్చిన రిప్లై తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











