Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పెళ్లి కాకుండా తల్లిని కావాలని ఆ పనిచేశా.. ముందు చూపుతో బిడ్డకు జన్మనిచ్చా
బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ పెళ్లి కాకుండానే మాతృత్వాన్ని పొందడం అప్పట్లో చర్చానీయాంశంగా మారింది. కేవలం ఏక్తాకపూర్ కాకుండా తన సోదరుడు తుషార్ కపూర్ కూడా అద్దె గర్బం ద్వారా తండ్రి కావడం మరెందరికో స్ఫూర్తిని ఇచ్చింది. పెళ్లికాకుండా మాతృత్వ మధురానుభూతిని పొందడంపై ఇటీవల ఏక్తా కపూర్ వివరంగా వెల్లడించారు. అద్దె గర్భం (సరోగసి) ద్వారా పిల్లల్ని ఎందుకు కనాలి అనుకొన్నానంటే..
పెళ్లి విషయంలో స్పష్టత
నన్ను పెళ్లి చేసుకోమని నా తల్లిదండ్రులు ఎప్పటి నుంచో పోరు పెడుతున్నారు. కానీ పెళ్లి విషయంలో స్పష్టమైన వైఖరి లేదు. ఒకరి కోసం నేను పెళ్లి చేసుకోవడం నచ్చదు. అందుకే నేను సింగిల్ పేరెంట్‌గా కావాలని చాలా రోజుల క్రితం నుంచే అనుకొంటున్నాను. నా వయసు 36 ఏళ్లు ఉన్నప్పుడే నా అండాలను భద్రపరుచుకొన్నాను. ఆ ముందు చూపుతోనే తల్లినయ్యాను అని ఏక్తా కపూర్ వెల్లడించారు.
నా తమ్ముడు చేసిన పనికి
సరోగసి ద్వారా సంతానం పొందాలనుకొనే సమయానికే నా సోదరుడు తుషార్ ఆ పనిని ముందే కానిచ్చాడు. నా సోదరుడు నన్ను కానీ, నా తల్లిదండ్రులను కానీ సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడం షాక్ గురిచేసింది. అలా పెళ్లి కాకుండా పిల్లలకు తండ్రి (సింగిల్ పేరెంట్)గా ఉండాలనుకోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది అని ఏక్తా కపూర్ తెలిపారు.
పెళ్లికాకుండానే తల్లివి
అయితే తుషార్ కపూర్ తీసుకొన్న నిర్ణయాన్ని ఆ తర్వాత నా తల్లిదండ్రులు స్వాగతించారు. ఇప్పుడు తుషార్ పిల్లల్ని అల్లారుముద్దుగా పెంచుతున్నారు. అత్తామామలు లేకుండా పిల్లలకు తల్లివి అయ్యావు. నిజంగా నీవు అదృష్టవంతురాలివి అని నా స్నేహితులు ఆటపట్టిస్తుంటారు అని ఏక్తా కపూర్ తెలిపారు.
మా పిల్లల్ని అల్లారు ముద్దుగా
తుషార్ కుమారుడు లక్ష్యను, నా కుమారుడు రావీ కపూర్‌ను మా తల్లిదండ్రలు జితేంద్ర కపూర్, శోభా కపూర్ చక్కగా చూసుకొంటున్నారు. వారిద్దరికి మా పిల్లలంటే పంచ ప్రాణాలు. ఎక్కువ సమయాన్ని వారితోనే గడుపుతుంటారు. బయట ప్రపంచం ఏమనుకొంటుందనే విషయాన్ని ఎప్పుడో గాలికి వదిలేశారు అని ఏక్తా కపూర్ అన్నారు.
Recommended Video
టెలివిజన్, సినీ రంగాల్లో ఏక్తా కపూర్
హిందీ వినోద పరిశ్రమలో ఏక్తా కపూర్ తొలుత టెలివిజన్ రంగంలో సత్తా చాటింది. ఆమె రూపొందించిన ఘర్ ఏక్ మందిర్ మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత ఖ్యోంకి సాస్ బీ కభీ బహూ థీ, కహానీ ఘర్ ఘర్ కీ లాంటి సీరియల్స్ అత్యంత ప్రజాదరణను చూరగొన్నాయి. అనంతరం సినీ నిర్మాణ రంగంలోకి ప్రవేశించి కృష్ణా కాటేజ్, షూట్ అవుట్ ఎట్ లోకండ్వాలా, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై, ది డర్టీ పిక్చర్, వీర్ ది వెడ్డింగ్, అజహర్, జడ్జ్‌మెంటల్ హై క్యా లాంటి చిత్రాలను తెరకెక్కించారు.