twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహిళా నిర్మాతకు ‘మెంటల్’ సమస్య... దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడికి ఎదురుదెబ్బ!

    |

    బాలీవుడ్‌లో సంచలన కథలతో సినిమాలు, టెలివిజన్ సీరియల్స్ తీయడంలో నిర్మాత ఏక్తా కపూర్‌ ప్రత్యేకమైన స్టయిల్. ఆమె నిర్మించే సీరియల్స్ అయినా.. సినిమాలైనా క్రేజీగా ఉంటాయి. అలాగే ఆమె పెట్టే సినిమా టైటిల్స్ కూడా క్యాచీగా ఉంటాయి. కృష్ణా కాటేజ్, లవ్ సెక్స్, ధోకా, లుటేరా, రాగిణి ఎమ్మెమ్మెస్, డర్టీ పిక్చర్ లాంటి టైటిల్ ఆకట్టుకొనేలా ఉంటాయి. క్యోంకి సాస్ భీ కభీ బహు తీ, కహానీ ఘర్ ఘర్ కీ అనే టైటిల్స్ ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. అయితే తాజాగా ఆమె నిర్మించిన చిత్రం వివాదంలో చిక్కుకున్నది. ఇంతకు ఆ వివాదం ఏమిటంటే..

    రాఘవేంద్రరావు కుమారుడి దర్వకత్వంలో

    రాఘవేంద్రరావు కుమారుడి దర్వకత్వంలో

    బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఏక్తా కపూర్ నిర్మిస్తున్న చిత్రం మెంటల్ హై క్యా. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ కోవెలముడి దర్శకత్వం వహించారు. ఈచిత్రానికి కథ ప్రకాశ్ భార్య కనికా థిల్లాన్ స్క్రీన్ ప్లే అందించారు. అయితే ఈ సినిమాపై బాలీవుడ్‌లో బజ్ ఏర్పడింది.

     టైటిల్‌పై తీవ్ర అభ్యంతరం

    టైటిల్‌పై తీవ్ర అభ్యంతరం

    కంగన రనౌత్, రాజ్ కుమార్ రావు, అమీరా దస్తర్ లాంటి క్రేజీ యాక్టర్లతో రూపొందిన మెంటల్ హై క్యా చిత్ర టైటిల్‌పై ఆరోగ్యశాఖ నిపుణులు, వైద్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. వైద్యుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉందని, సినిమా టైటిల్‌ను మార్చాలని డిమాండ్ చేస్తున్నారట.

    టైటిల్‌పై పెరుగుతున్న వ్యతిరేకత

    టైటిల్‌పై పెరుగుతున్న వ్యతిరేకత

    అయితే టైటిల్ వివాదంపై చిత్ర నిర్మాత, దర్శకులు చాలా తేలికగా తీసుకొన్నారట. కొన్ని రోజులు అభ్యంతరం వ్యక్తం చేసి ఊరుకొంటారని అనుకొన్నారట. కానీ మెంటల్ హై క్యా అనే టైటిల్ మార్చాల్సిందేనని గట్టిగా పట్టుపడుతున్నారట. దాంతో ఈ వివాదం రోజు రోజుకు పెరిగిపోతుండటంతో ప్రస్తుతం ఏం చేయాలనే విషయాన్ని ఆలోచిస్తున్నారట.

    తొలగించాలా? వద్దా అనే సందేహంతో

    తొలగించాలా? వద్దా అనే సందేహంతో

    మెంటల్ హై క్యా టైటిల్ నుంచి మెంటల్ అనే పదాన్ని తొలిగించాలా? లేదా అనే విషయంపై ప్రస్తుతం టీమ్ పునరాలోచనలో పడిందట. ఒకవేళ మెంటల్ అనే పదం తీసేస్తే సినిమాపై ఏర్పడిన క్రేజ్ పోతుందా అనే భయం కూడా వారిని వెంటాడుతున్నదట. ఎందుకంటే ఈ సినిమా టైటిల్ ఇప్పటికే జనంలోకి వెళ్లిపోయింది. మళ్లీ సినిమా టైటిల్ మారిస్తే ఆ రేంజ్ క్రేజ్ వస్తుందా అనే విషయం కన్‌ఫ్యూజన్‌గా మారిందట.

    ఇప్పటికే ఖర్చు తడిసి మోపెడంతా

    ఇప్పటికే ఖర్చు తడిసి మోపెడంతా

    అంతేకాకుండా ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్‌కు ఖర్చు తడిసి మోపెడైందనే మాట వినిపిస్తున్నది. మెంటల్ హై క్యా టైటిల్‌తో టీజర్లు, ట్రైలర్లు, ప్రింట్, టెలివిజన్ ప్రకటనలు ప్రమోషన్‌కు వాడుతున్నారు. వాటి కోసం భారీగా ఖర్చు చేశారు కూడా. ఒకవేళ సినిమా టైటిల్ మారిస్తే.. మళ్లీ కథ మొదటికి రావడమే కాకుండా ఖర్చు కూడా భారీగా పెరిగిపోయే అవకాశం ఉందనే విషయం చిత్ర యూనిట్‌ను సంకటంలో పడేసిందనేది తాజా సమాచారం.

    బాద్షా షారుక్ ఖాన్ గెస్ట్‌గా

    బాద్షా షారుక్ ఖాన్ గెస్ట్‌గా

    మెంటల్ క్యా హై చిత్రంలో కంగన, రాజ్ కుమార్ రావు, అమీరా దస్తర్, జిమ్మీ ష్రెగిల్, సతీష్ కౌశిక్, అమ్రితా పురి, మీమో చక్రవర్తి నటిస్తున్నారు. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ప్రత్యేక పాత్రలో ప్రేక్షకులను కనువిందు చేయనున్నారు. ఈ సినిమా జూన్ 21న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది.

    English summary
    Mental Hai Kya comedy film produced by Ekta Kapoor and directed by Prakash Kovelamudi, starring Kangana Ranaut, Rajkummar Rao, Amyra Dastur, Amrita Puri, Jimmy Sheirgill & Shah Rukh Khan will have an extended cameo role.The screenplay was written by Kanika Dhillon.The principal photography of the film began on 16 May 2018.The film will be released on 21 June 2019. Music rights are owned by Zee Music Company.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X