షేక్ హ్యాండ్ ఇచ్చి.. వేలితో గోకితే అర్థం అదేనంటా..

By Kalyan

క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎక్కడైనా ఉంటుంది. అయితే సినీ ఇండస్ట్రీ అనేది గ్లామర్ ప్రపంచం కాబట్టి అలాంటి పదాలన్నీ ఇక్కడే ఎక్కువగా వినిపిస్తాయి.. కనిపిస్తాయి. అయితే అందరూ అవకాశాన్ని వాడుకుంటూ క్యాస్టింగ్ కౌచ్ కు పాల్పడతారనీ చెప్పలేము. అన్ని చోట్లా మంచి చెడు ఉన్నట్లే చిత్ర పరిశ్రమలోనూ ఉంటుంది.

అయితే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అంటూ తేడా లేకుండా క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉందనేది కాదనలేని సత్యం. ఆ మధ్య దీనిపై ఓ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. కానీ ఎక్కువ కాలం నిలవలేదు. ఇరువైపుల నుంచి తప్పులు ఉండటం, మరికొందరు కావాలనే పనిగట్టుకుని చేయడంతో అది పక్కదారి పట్టింది.

Elli Avrram Shares Her Incident About Casting Couch

తాజాగా బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రామ్.. సంచలన నిజాలు బయటపెట్టింది. మొదట్లో సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో..జరిగిన సంఘటనను వెల్లడించింది. కథలు వినడానికి, ఆడిషన్స్ వెళ్లినప్పుడు డైరెక్టర్లు తనను కావాలనే కించపరిచేవారని, ఎత్తు తక్కువగా ఉన్నావని, పళ్లు సరిగా లేవని ఇలా ఏదో రకంగా అనేవారంటూ చెప్పుకొచ్చింది. దాంతో పాటు షేక్ హ్యాండ్ ఇచ్చి వేలితో గోకే వారు అయితే మొదట్లో తనకూ అర్థమయ్యేది కాదని చెప్పుకొచ్చింది.

తనకు తెలిసిన ఫ్రెండ్ కు ఈ విషయాలన్నీ చెబితే భయంకరమైన విషయాలను వెల్లడించారు. అలా షేక్ హ్యాండ్ ఇచ్చి.. వేలితో గోకితో.. నీతో పడుకోవాలని అనుకుంటున్నాను.. అని ఇండికేషన్ అంటూ బాంబ్ పేల్చాడట. ఇలా తనకు ఎదురైన సంఘటనల గురించి చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X