Don't Miss!
- News ఐరాస భద్రతామండలిలో భారత్ కు శాశ్వత హోదా- ఎలాన్ మస్క్ డిమాండ్ కు బైడెన్ ఓకే..!
- Finance Gold Price: శుభవార్త.. ఆకాశం నుంచి విరిగిపడ్డ బంగారం ధర.. షాపింగ్ షురూ చేసేయండి..
- Sports లేడీ ఫ్యాన్ అందాన్ని చూసి కంట్రోల్ తప్పిన గిల్ Video
- Technology షియోమీ ప్రత్యేక ఈవెంట్.. బడ్స్ 5A, ప్యాడ్ SE సహా కీలక ఉత్పత్తుల విడుదల.. పూర్తి వివరాలు..!
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
ప్రతిసారి 20 లిప్ లాక్స్, ఇక నా వల్ల కాదు .. ముద్దుల వీరుడికి అలుపొచ్చిందట!
Recommended Video
ఇమ్రాన్ హష్మీ పేరు చెప్పగానే బాలీవుడ్ చిత్రాలు ఘాటైన లిప్ లాక్ సన్నివేశాలు గుర్తుకు వస్తాయి. సీరియల్ కిస్సర్ గా ఇమ్రాన్ హష్మీకి గుర్తింపు దక్కింది. మల్లికా శరావత్, తనుశ్రీ దత్త, జాక్వెలిన్ ఇలా చాలా మంది బాలీవుడ్ భామలతో ఇమ్రాన్ హష్మీ వెండి తెరని వేడెక్కించాడు. తాజాగా ఇమ్రాన్ హష్మీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తాను ముద్దు సన్నివేశలతో అలసిపోయినట్లు తెలిపాడు. ప్రస్తుతం ఇమ్రాన్ హష్మీ వై చీట్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ముద్దులతో అలసిపోయా
గత 17 ఏళ్ల నుంచి ప్రతి చిత్రంలో కనీసం 20 లిప్ లాక్ సన్నివేశాల్లో నటిస్తున్నా. సీరియల్ కిస్సర్ అనే గుర్తింపు కూడా వచ్చింది. ముద్దులతో బాగా అలసిపోయా. ఈ లిప్ లాక్ చిత్రాల నుంచి బయటకు వచ్చి కొత్తగా ప్రయత్నించాలని అనుకుంటున్నట్లు ఇమ్రాన్ హష్మీ తెలిపాడు. ఇమ్రాన్ హష్మీ చిత్రం అంటే అది ముద్దుల సినిమానే అనే భావన యువతలో ఉండేది.
ఏది సెక్సువల్ హరాస్మెంట్ అనేది అర్థం చేసుకోవాలి: ఇమ్రాన్ హష్మి
నాకు ఇష్టమే
సీరియల్ కిస్సర్ అని పిలిపించుకోవడం నాకు ఇష్టమే. ఆ ఇమేజ్ వలనే నేను ఇన్ని చిత్రాల్లో నటించగలిగా అని ఇమ్రాన్ హష్మీ తెలిపాడు. నా చిత్రాలు చాలా విజయం సాధించాయి. కొన్ని నిరాశపరిచాయి. కానీ నాకు మాత్రం ముద్దు సన్నివేశాల వలన మంచి గుర్తింపు వచ్చింది. యువతలో క్రేజ్ ఏర్పడింది అని ఇమ్రాన్ హష్మీ చెప్పుకొచ్చాడు.
కష్టమే కానీ ప్రయత్నిస్తా
సీరియల్ కిస్సర్ అనే ఇమేజ్ కు దూరంగా నేను చిత్రాలు చేయడం కష్టమే. అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. ఎందుకంటే ముద్దు సన్నివేశాల ఇమేజ్ నాపై బాగా ఉంది. కొంచెం కొత్తగా ట్రై చేయడం, ఆడియన్స్ ని మెప్పించడం కష్టమే. కానీ ప్రయత్నిస్తా అని ఇమ్రాన్ హష్మీ తెలిపాడు. సినిమాల్లో ఒక ముద్ర పడ్డాక దానినుంచి బయటకు రావడం కష్టమైన పని అని ఇమ్రాన్ తెలిపాడు.
వై చీట్ ఇండియా చిత్రంతో
ఇమ్రాన్ హష్మీ తాజాగా నటించిన వై చీట్ ఇండియా చిత్రం జనవరి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ తన ఇమేజ్ కు భిన్నంగా వినోదాత్మక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఈ చిత్రానికి చీట్ ఇండియా అనే టైటిల్ ఖరారు చేశారు. అది కాస్త వివాదం కావడంతో వై చీట్ ఇండియాగా మార్చారు.