For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏది సెక్సువల్ హరాస్మెంట్ అనేది అర్థం చేసుకోవాలి: ఇమ్రాన్ హష్మి

    |

    మీటూ ఉద్యమం ఇండియాలో ఉవ్వెత్తున ఎగిసి పడిన సందర్భంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ పరిశ్రమలో ఈ ఉద్యమం ఎఫెక్టుతో చాలా మంది ప్రభావితం అయ్యారు. ఈ ఉద్యమం ఇచ్చిన ధైర్యంతో పలువురు మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి తాను ఎదుర్కొన్న భయంకరమైన అనుభవాలు, సెక్సువల్ హరాస్మెంట్ ఇన్సిడెంట్స్ మీడియాతో పంచుకున్నారు.

    ఈ క్రమంలో నానా పాటేకర్, సుభాష్ ఘాయ్, రజత్ కపూర్, సాజిద్ ఖాన్, అలోక్ నాథ్ లాంటి టాప్ సెలబ్రిటీలు సైతం మీటూ ఉద్యమం సెగ ఫేర్ చేశారు. తాజా ఇండియా టుడే మైండ్ రాక్స్ 2019 కార్యక్రమంలో పాల్గొన్న ఇమ్రాన్ హష్మి #మీటూ ఉద్యమంపై స్పందించారు.

    ఇండియాలో ఈ ఉద్యమం మొదలవ్వడం హ్యాపీ

    ఇండియాలో ఈ ఉద్యమం మొదలవ్వడం హ్యాపీ

    ఇండియాలో మీటూ ఉద్యమం మొదలవ్వడం ఆనందంగా ఉంది. దీని వల్ల ఎంతో మేలు జరిగింది. ఇది మొదట యూఎస్ఏలో ప్రారంభమైంది. సోషల్ మీడియా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిందని ఇమ్రాన్ హష్మి తెలిపారు.

    ఏది సెక్సువల్ హరాస్మెంటో అర్థం చేసుకోవాలి

    ఏది సెక్సువల్ హరాస్మెంటో అర్థం చేసుకోవాలి

    ఏది సెక్సువల్ హరాస్మెంటు అనే విషయం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఇలాంటివి ఏమైనా జరిగితే వెంటనే బయట పెట్టాలి. ఎవరికీ చెప్పకుండా ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అని తెలిపారు.

    నిర్మాణ సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలి

    నిర్మాణ సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలి

    సినిమా షూటింగ్స్ సమయంలో సెక్సువల్ హరాస్మెంట్ జరుగకుండా నిర్మాణ సంస్థలు తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. సెట్స్‌లో ఎక్కువ మంది మహిళా సిబ్బంది ఉండటం మంచిది. నేను నా సినిమా నిర్మాణం సమయంలో యాభై శాతం మంది మహిళలు ఉండేలా చూసుకుంటాను... అని ఇమ్రాన్ హష్మి చెప్పుకొచ్చారు.

    చీట్ ఇండియా

    చీట్ ఇండియా

    ఇమ్రాన్ హష్మి నటిస్తున్న సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆయన ‘చీట్ ఇండియా' అనే చిత్రంలో నటిస్తున్నారు. జనవరి 18న ఈ చిత్రం విడుదలవుతోంది.

    English summary
    At India Today Mind Rocks 2019, Emraan Hashmi opened up about the MeToo movement and said, "I'm very happy that this movement started. It has penetrated culture now. It started in the US, but people weren't very aware of it then. Social media really helped it to become big."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X