twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షారుక్‌ ఖాన్ మరో షాక్.. ఈడీ 70 కోట్లు జప్తు.. క్లారిటీ ఇచ్చిన బాద్షా టీం..

    |

    బాలీవుడ్‌ బాద్షా షారుఖ్ ఖాన్‌కు సంబంధించిన ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్‌ బ్యాంక్ ఖాతాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) సీజ్ చేయడం మీడియాలో సంచలనం చేపింది. రోజ్ వ్యాలీ పోంజి కుంభకోణం వ్యవహారంలో మనీలాండరింగ్ కేసులో సుమారు రూ.70 కోట్లను సీజ్ చేయడంతో షారుక్ ఖాన్‌ కష్టాల్లో పడినట్టు కనిపించింది. ఈ వ్యవహారంపై షారుక్ ఖాన్ పీఆర్ వర్గాలు మీడియాలో వివరణ ఇచ్చాయి.

    రూ.71 కోట్లు సీజ్

    రూ.71 కోట్లు సీజ్

    మల్టీపుల్ రిసార్టు ప్రైవేట్ లిమిటెడ్, కోల్‌కతా సెయింట్ జేవియర్స్ కాలేజీ, నైట్ రైడర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన ఖాతాలను సీజ్ చేశాం. ఆ ఖాతాల విలువ రూ.70.11 కోట్లు. ఈ ఖాతాలను మనీలాండరింగ్ యాక్ట్ కింద సీజ్ చేశాం అని ఈడీ వెల్లడించింది.

     షారుక్ భార్య ఖాతాలకు నిధుల మళ్లింపు

    షారుక్ భార్య ఖాతాలకు నిధుల మళ్లింపు

    నైట్ రైడర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో షారుక్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్, జుహీ చావ్లా భర్త విజయ్ మెహతా, వెంకీ మైసూర్‌ డైరెక్టర్లు కావడం, ఆ కంపెనీ ఖాతాలకు రోజ్ వ్యాలీ గ్రూప్ ఖాతా నుంచి నిధులు మళ్లింపు జరగడంతో అనేక అనుమానాలు తలెత్తాయి. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన ఈడీ పలుమార్లు వీరిని ప్రశ్నించింది. అంతేకాకుండా అనేక మార్లు ఖాతాలను జప్తు కూడా చేసింది.

     అటాచ్‌మెంట్‌తో సంబంధం లేదు

    అటాచ్‌మెంట్‌తో సంబంధం లేదు

    తాజా ఈడీ అటాచ్‌మెంట్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ వర్గాలు స్పందిస్తూ.. ఈ వ్యవహారంతో షారుఖ్ ఖాన్‌కు గానీ, ఆయన భార్య గౌరీ ఖాన్‌కు కేసు, ఈడీ అటాచ్‌మెంట్‌తో సంబంధం లేదు. వారికి సంబంధించి అదో స్పాన్సర్ డీల్ మాత్రమే. అందులో వారి భాగస్వామ్యం ఏమీ లేదు అని అన్నారు.

    ఇప్పటి వరకు 4750 కోట్లు జప్తు

    ఇప్పటి వరకు 4750 కోట్లు జప్తు

    2015లో బయటపడిన ఈ కుంభకోణంతో లింకుల గురించి షారుక్‌ను పలుమార్లు ఈడీ ప్రశ్నించింది. ఫెమా యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈడీ తీవ్రంగా స్పందించింది. తాజా ఖాతాల జప్తుతో ఇప్పటి వరకు రూ.4750 కోట్ల మేర ఖాతాను సీజ్ చేయడం గమనార్హం. దాదాపు రెండేళ్లపాటు షారుక్ యాజమాన్యంలో నడించిన కేకేఆర్‌కు రోజ్ వ్యాలీ గ్రూప్ రెండేళ్లపాటు స్పాన్సర్‌గా ఉన్నారు.

    English summary
    Enforcement Directorate attached 70 crores of Shah Rukh Khan's KRSPL accounts. On this, Shah Rukh Khan team clarifies that.. nothing to do with attachment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X