twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RajKundra కేసులో ఈడీ ఎంట్రీ.. అనుకున్నంతా అయ్యిందిగా!

    |

    శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను మంగళవారం (జూలై 27) ముంబై కోర్టు ఆగస్టు 10 వరకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అశ్లీల చిత్రాలు రూపొందించాడనే ఆరోపణలపై కుంద్రాను జూలై 19 న మరో 11 మందితో పాటు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక రాజ్ కుంద్రా బెయిల్ అభ్యర్ధనపై బాంబే హైకోర్టు విచారణను వాయిదా వేసింది. విచారణ సమయంలో హాజరు కావాలని కేసు దర్యాప్తు అధికారిని కోరింది. ప్రస్తుతానికి రాజ్ కుంద్రాకు బెయిల్ లభించలేదు. తుది విచారణ గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు జరుగుతుంది. ఇక ముందు నుంచి ఊహాగానాలు వినిపించినట్టుగానే ఈ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు అప్పగించారు.

    తాజాగా ముంబై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు అప్పగించారు. మంగళవారం (జూలై 27) కేసుకు సంబంధించిన పత్రాలను ఈడీ సేకరిస్తుంది. అయితే, ఈ విషయంలో వారు ఇంకా ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదు. రాజ్ కుంద్రా మరియు శిల్పా శెట్టి యొక్క డబ్బుల విషయం. అలాగే అశ్లీల రాకెట్ కేసులో వారి ప్రమేయం ఉందని దర్యాప్తు చేయడానికి క్రైమ్ బ్రాంచ్ ఒక ఆర్థిక ఆడిటర్ను కూడా నియమించింది.

    Enforcement Directorate has asked for FIR copy in the Raj Kundra Pornography case

    ఇక దర్యాప్తులో శిల్పా శెట్టి మరియు రాజ్ కుంద్రా సంయుక్త ఖాతా నుంచి కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయని క్రైమ్ బ్రాంచ్ కనుగొంది. హాట్‌షాట్‌,బోలీఫేమ్ యాప్ ద్వారా వచ్చే ఆదాయాలు ఈ ఖాతాలోకి వచ్చాయని క్రైమ్ బ్రాంచ్ అనుమానిస్తోంది. యాప్‌ల నుంచి సంపాదించిన డబ్బును బిట్‌కాయిన్లలో పెట్టుబడులు పెడుతున్నారా అని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారరు. ఇక ఈ కేసులో కుంద్రా కంపెనీకి చెందిన నలుగురు ఉద్యోగులు సాక్షులుగా మారారని, అతనికి ఇబ్బందులు పెరుగుతున్నాయని కూడా పోలీసులు ఆదివారం నాడు తెలియజేశారు.ఇక ఈ కేసులో ఈడీ కూడా ఎంటర్ కావడంతో రాజ్ కుంద్రా చిక్కుల్లో పడక తప్పదని అంటున్నారు.

    English summary
    The Enforcement Directorate (ED) has asked for certain documents and an FIR copy from Mumbai Crime Branch in the Raj Kundra Pornography case. here are more details.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X