రాజ్‌కపూర్ మనవడి ఇంటిపై ఈడీ దాడులు.. ఎమ్మెల్యే కుమారుడిపై కూడా కేసు!
భారతీయ సినీ పరిశ్రమలో లెజెండరీ యాక్టర్, డైరెక్టర్, నిర్మాత రాజ్‌కపూర్ మనవడు రమీ జైన్ కుమారుడు ఆర్మాన్ జైన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో విచారణ చేపట్టిన ఈడీ అధికారులు ఇటీవల మెరుపు దాడులు నిర్వహించిన తర్వాత సమన్లు జారీ చేశారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

రాజ్‌కపూర్ మనవడి ఇంటిలో...
ప్రఖ్యాత నటుడు రాజ్ కపూర్ ముని మనవడు అర్మాన్ జైన్ ఇంటిలో ఫిబ్రవరి 2021 9వ తేదీన సోదాలు నిర్వహించారు. అదే రోజు రాజ్ కపూర్ తనయుడు రాజీవ్ కపూర్ ఆకస్మిక మరణం సంభవించడంతో అర్మాన్ జైన్ ఇంటిలో సోదాలు ఆపివేశారు. ముంబైలోని అల్టామౌంట్ రోడ్ ప్రాంతంలొని ఇంటిలో రెండు గంటలపాటు సోదాలు కొనసాగాయి.

శివసేన ఎమ్మెల్యే కుమారుడికి కూడా
గత కొద్దికాలంగా టాప్స్ గ్రప్ కేసును విచారిస్తున్న ఈడీ దర్యాప్తు సంస్థ పలుమార్లు ఆయనను విచారించినట్టు ముంబై మీడియా పేర్కొన్నారు. శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ కుమారుడు విహాంగ్ సార్నాయిక్‌కు సన్నిహిత సంబంధాలపై ఆరా తీశారు. ఈడీ విచారణలో శివసేన ఎమ్మెల్యే కుమారుడి పేరు కూడా బయటకు రావడంతో అధికారులు ఈ కేసును సీరియస్‌గా పరిగణించారు.

ఎమ్మెల్యే కుమారులపై ఈడీ నిఘా
మీడియా రిపోర్టుల ప్రకారం.. టాప్స్ గ్రప్ కేసులో నవంబర్ 2020న ముంబైలోని ప్రతాప్ సర్నాయిక్ ఆఫీసులో కూడా సోదాలు నిర్వహించారు. అనంతరం విహంగ్, ఆయన సోదరుడు పుర్వేశ్‌ను కూడా ఈడీ విచారించారు.

అర్మాన్ జైన్ కెరీర్ గురించి
రాజ్‌కుమార్ కుమార్తె రిమా జైన్, మనోజ్ జైన్ దంపతుల కుమారుడే ఆర్మాన్ జైన్. రాజ్‌కుమార్ సినీ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. 2014లో లేకర్ హమ్ దీవానా దిల్ హిందీ చిత్రంలో నటించారు. ఆ తర్వాత 2019లో అనిస్సాను వివాహం చేసుకొన్నారు.


Click it and Unblock the Notifications











