twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పీకల్లోతు కష్టాల్లో రియా చక్రవర్తి.. ఈడీ, సీబీఐ వేట మొదలు.. ఆగస్టు 7న కీలకంగా..

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులోకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. సుశాంత్ సింగ్ బ్యాంక్ అకౌంట్లు దుర్వినియోగం జరిగిందని తండ్రి కేకే సింగ్ చేసిన ఫిర్యాదును ఈడీ స్వీకరించింది. ఈ వ్యవహారంలో అనుమానాస్పదంగా మారిన సుశాంత్ ప్రియురాలు, హీరోయిన్ రియా చక్రవర్తిని విచారించేందుకు సమన్లు జారీ చేయడం బాలీవుడ్‌లో చర్చకు దారి తీసింది. సుశాంత్‌ కేసులో రియా చుట్టూ ఇప్పుడు ఈడీ, సీబీఐలు దర్యాప్తు చేయడంతో ఆమె ఇబ్బందుల్లో పడిందనే అభిప్రాయాన్ని పలు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈడీ జారీ చేసిన సమన్లు గురించి పూర్తి వివరాలు..

    సుశాంత్ అకౌంట్ నుంచి డబ్బు ట్రాన్స్‌ఫర్

    సుశాంత్ అకౌంట్ నుంచి డబ్బు ట్రాన్స్‌ఫర్


    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకౌంట్ నుంచి ట్రాన్స్‌ఫర్ అయిన డబ్బుతో ఏమైనా అక్రమ లావాదేవీలు జరిగాయా అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. మానీ లాండరింగ్ కేసును నమోదు చేసి రియాను విచారించాలని బుధవారం నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు రియాకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 7 తేదీన విచారణకు హాజరుకావాలంటూ సమన్లలో పేర్కొన్నది.

    సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు ఆధారంగా

    సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు ఆధారంగా

    రియాపై దాఖలైన మనీలాండరింగ్ కేసు గురించి ఈడీ అధికారులు స్పందించారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కేసులో ప్రశ్నించడానికి రియాకు సమన్లు జారీ చేశాం. ఈ కేసులో బీహార్ పోలీసులకు సుశాంత్ తండ్రి చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తాం. ఆమెను ముంబై ఆఫీస్‌లో విచారణకు హాజరుకావాలని సమన్లలో పేర్కొన్నాం. అదే రోజు ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తాం అని పేర్కొన్నారు.

    అక్రమ ఆస్తుల కొనుగోలు జరిగిందా?

    అక్రమ ఆస్తుల కొనుగోలు జరిగిందా?

    బీహార్ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా చేసుకొని పీఎంఎల్ఏ యాక్టు కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టును రిజిస్టర్ చేశారు. సుశాంత్ బ్యాంక్ జరిగిన అకౌంట్లలో అవకతవకలున్నాయనే ఫిర్యాదును పరిశీలిస్తున్నాం. సుశాంత్ డబ్బుతో ఏవైనా అక్రమ లావాదేవీలు, మనీలాండరింగ్ జరిగిందా? అక్రమ ఆస్తుల కొనుగోలు జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తాం అని అన్నారు.

    ఎఫ్ఐఆర్ దాఖలుకు సీబీఐ

    ఎఫ్ఐఆర్ దాఖలుకు సీబీఐ

    ఇక ఈడీ తర్వాత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును సీబీఐ దర్యాప్తు చేయడానికి సిద్ధమైంది. త్వరలోనే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి చర్యలు తీసుకొంటున్నది. సుశాంత్ ఫ్యామిలీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించి ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

    Recommended Video

    Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
    రియా పిటిషన్‌పై స్పందించండి

    రియా పిటిషన్‌పై స్పందించండి

    బీహార్‌లో తనపై దాఖలైన కేసును ముంబైకి బదిలీ చేయాలని రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు విచారించింది. రియా దాఖలు చేసిన పిటిషన్‌పై బీహార్, మహారాష్ట్ర ప్రభుత్వాలు, ముంబై పోలీసులు, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్యామిలీ స్పందించాలి. ఆమె పిటిషన్‌కు రిప్లై ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

    English summary
    Enforcement Directorate summoned for questioning Rhea Chakraborty on August 7. ED is going to question money laundering case related to actor Sushant Singh and CBI is ready file FIR in this case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X