twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హేమమాలినికి కరోనా.. క్లారిటీ ఇచ్చిన ఈషా డియోల్

    |

    ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒక్కటే వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే కరోనాపై కుప్పలు తెప్పలుగా ఫేక్ న్యూస్ కనిపిస్తాయి. కరోనా కేసుల్లో భారతదేశం రోజురోజుకూ జెట్ స్పీడ్‌లో దూసుకుపోవడంతో సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. రోజుకు వేలల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇవి చాలనట్టుగా.. కొందరు సెలెబ్రిటీలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. సెలెబ్రిటీలకు కరోనా సోకిందనే రూమర్లను వ్యాప్తి చేస్తున్నారు.

    హేమమాలినిపై రూమర్స్..

    హేమమాలినిపై రూమర్స్..

    హేమమాలిని గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఎవ్వరూ ఉండరు. అయితే ప్రస్తుతం నెలకొని ఉన్న విపత్కర పరిస్థితిలో హేమమాలినికి కరోనా సోకిందనే రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. హేమమాలిని ఆస్పత్రిలో చేరడంతో ఈ వార్తలు దావానంలా వ్యాప్తి చెందాయి.

    క్లారిటీ ఇచ్చిన ఈషా..

    క్లారిటీ ఇచ్చిన ఈషా..

    హేమమాలిని కూతురు ఈషా డియోలో ఆ రూమర్లను ఖండించింది. తన అమ్మ క్షేమంగా, ఆరోగ్యంగా ఉందని, దయచేసి ఆ రూమర్లను నమ్మకండని చెప్పుకొచ్చింది. ఎవ్వరూ ఆందోళన చెందకండని, తమపై అభిమానం చూపిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలని తెలిపింది.

    హేమమాలిని సైతం..

    హేమమాలిని సైతం..


    తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తలపై హేమమాలిని సైతం స్పందించింది. ఓ వీడియోను రిలీజ్ చేస్తూ రూమర్లను ఖండించింది. ‘మీరు చూపించిన ప్రేమకు థ్యాంక్స్. ఆ కృష్ణ పరమాత్ముడి దయ వల్ల నేను ఆరోగ్యంగానే ఉన్నాను. రాధే రాధే.. మీ అందరూ ఇంటి పట్టునే ఉండండి.. ఆరోగ్యంగా ఉండండ'ని కోరింది.

    Recommended Video

    Eesha Rebba & Puvvada Ajay Kumar Bike Ride
    బాలీవుడ్‌పై కరోనా పంజా..

    బాలీవుడ్‌పై కరోనా పంజా..

    బాలీవుడ్‌పై కరోనా పంజా విసురుతోంది. స్టార్ సెలెబ్రిటీల ఇంట్లోనో, వారి సిబ్బంధికో ఎవరికో ఒకరికి కరోనా సోకుతోంది. నేడు బచ్చన్ ఫ్యామిలీ మొత్తం (జయా బచ్చన్ మినహా) కరోనా బారిన పడగా.. అనుపమ్ ఖేర్ కుటుంబం సైతం కరోనాతో ఆస్పత్రిలో జాయిన్ కావాల్సి వచ్చింది.

    English summary
    Esha deol Clarity On Hema Malini Health. My mother dreamgirlhema is fit & fine! The news regarding her health is absolutely fake so please don’t react to such rumours! Thanks to everyone for their love & concern
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X