For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అతడొక 'గొరిల్లా'.. నోరు జారిన ఇషా గుప్త.. ఫ్రస్ట్రేషన్‌లో అలా అన్నా, క్షమించండి!

    |

    హాట్ బ్యూటీ ఇషా గుప్త తరచుగా అర్థ నగ్న ఫోటో షూట్స్ చేస్తూ వివాదాల్లో చిక్కుకుంటుంటుంది. తాజాగా ఈషా గుప్త మరో వివాదంలో ఇరుక్కుని నెటిజన్ల ట్రోలింగ్ కు బలైంది. ఓ ఫుట్ బాల క్రీడాకారుడిపై ఈషా గుప్త తన పైత్యాన్ని ప్రదర్శించింది. దీనితో నెటిజన్లు ఈషా గుప్తాపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈషా గుప్త అతడిపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిందంటూ వివాదం తీవ్రంగా మారుతుండడంతో ఆమె స్పందించింది. క్షమాపణలు తెలిపి వివాదానికి తెరదించే ప్రయత్నం చేసింది.

     అతడొక 'గొరిల్లా'

    అతడొక 'గొరిల్లా'

    ఇషా గుప్త నైజీరియాకు చెందిన ఫుట్ క్రీడాకారుడు గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అతడిని గొరిల్లాతో పోల్చుతూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. తన ఫ్రెండ్ తో సోషల్ మీడియాలో చాట్ చేస్తున్న సందర్భంగా ఈషా గుప్త నైజీరియా క్రీడాకారుడు అలెగ్జాండర్ లౌబిని అతడొక గొరిల్లా అంటూ కామెంట్ చేసింది. తడిని ఎందుకు గ్రౌండ్ లోకి దించారో అర్థం కావడం లేదు. బెంచ్ మీదే ఉంచాల్సింది అంటూ వ్యాఖ్యానించింది. ఈషా గుప్త వ్యాఖ్యలకు సంబందించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దుమారం రేగుతోంది.

    జాతి వివక్ష వ్యాఖ్యలు

    జాతి వివక్ష వ్యాఖ్యలు

    పలువురు నెటిజన్లు వీటిని జాతివివక్ష వ్యాఖ్యలుగా పరిగణిస్తున్నారు. ఈషా గుప్త వైఖరిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈషా గుప్త వ్యాఖ్యలని ఫుట్ బాల్ అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. స్వయంగానే ఈషా గుప్తనే గతంలో జాతి వివక్షకు గురైంది. అది ఆమెకు గుర్తులేదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనితో ఈషా గుప్త ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావించి క్షమాపణలు తెలిపింది.

    ఫ్రస్ట్రేషన్‌లో అలా అన్నా

    మ్యాచ్ చూస్తున్నప్పుడు ఫ్రస్ట్రేషన్ కు గురయ్యా. స్నేహితుడితో చాట్ చేస్తూ పొరపాటున ఆ వ్యాఖ్యలు చేశా. అవి జాతి వివక్ష వ్యాఖ్యలుగా మారుతాయని నేను గమనించలేదు. బుద్ది తక్కుగా ప్రవర్తించినందుకు క్షమించండి అని ఈషా గుప్త తెలిపింది. నాకు క్రీడలన్నా, క్రీడాకారులన్నా చాలా ఇష్టం అని ఇషా గుప్త తెలిపింది.

     ఫోటోషూట్స్‌తో

    ఫోటోషూట్స్‌తో

    ఇషా గుప్త హాట్ హాట్ ఫోటో షూట్స్ తోనే పాపులర్ అయింది. బికినీ ఫోటోషూట్స్, అర్థ నగ్న ఫోటో షూట్స్ చేస్తూ యువతలో బాగా క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడిప్పుడే ఇషా గుప్త పలు చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. ఇటీవల రాంచరణ్ విజయ విధేయ రామ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో పెర్ఫామ్ చేసింది. ప్రస్తుతం ఈషా గుప్త దేశీ మ్యాజిక్, వన్ డే లాంటి బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది.

    English summary
    Esha Gupta Called 'Racist' After Sharing Comments Comparing Nigerian Footballer Alex Iwobi to Gorilla
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X