పీరియడ్స్ ఇబ్బంది భరిస్తూనే అన్నీ చేస్తాం: క్రికెటర్ తీరుపై హీరోయిన్ ఫైర్
క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కెఎల్ రాహుల్ మహిళలను ఉద్దేశించి కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో సైతం వీరిపై తీవ్రమైన ట్రోలింగ్ జరుగుతోంది.
మహిళలను ఉద్దేశించి వీరు చేసిన కామెంట్లకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. బీసీసీఐ వీరిని ఆస్ట్రేలియా వన్డే సిరీస్ నుంచి సస్పెండ్ చేసింది. అంతే కాదు పలు కార్పొరేట్ సంస్థలు సైతం వీరితో వాణిజ్య ప్రకటనల ఒప్పందాలు రద్దు చేసుకున్నాయి.

ఇషా గుప్తా కూడా ఛీ కొట్టింది
హార్దిక ప్యాండ్యా గర్ల్ ఫ్రెండుగా కొంతకాలంగా వార్తల్లో ఉన్న ఇషా గుప్తా కూడా... మహిళల గురించి వీరు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. తనకు అతడితో కనెక్షన్ ఉందనే వార్తలను ఆమె ఈ సందర్భంగా ఖండించడం గమనార్హం.

ఆ ప్రశ్న అడగ్గానే ఇషా గుప్తా ఫైర్
ఇటీవల ఓ ఈవెంటులో పాల్గొన్న ఈషా గుప్తాకు మీడియా ప్రతినిధుల నుంచి హార్దిక్ పాండ్యా గురించిన ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ... ఎవరు అతడు? అతడు నాకు ఫ్రెండ్ అని నీకు ఎవరు చెప్పారు? అంటూ మండి పడ్డారు.

మేము ప్రతి నెలా పీరియడ్స్‌తో బాధ పడుతూనే అన్నీ చేస్తాం
ఈ సందర్భంగా ఇషా గుప్తా.. హార్దిక పాండ్యా కామెంట్లపై విరుచుకుపడ్డారు. మహిళలు పురుషులతో తమను తాము పోల్చుకోకూడదు. మేము ప్రతి విషయంలోనూ ది బెస్ట్. ప్రతి నెలా 5 రోజులు మేము పీరియడ్స్‌తో ఇబ్బంది పడతాం. అయినా సరే డాన్స్ చేస్తాం, ఆఫీసుకు వెళతాం, పిల్లల బాగోగులు చూసుకుంటాం. ఇవన్నీ మీరు చేయగలిగినపుడే అత్యుత్తమంగా ఉంటారు... అని ఇషా గుప్తా వ్యాఖ్యానించారు.

నీ ఫ్యామిలీకి ఇబ్బంది లేదంటే మాట్లాడు కానీ...
ఎవరైనా మహిళల గురించి బ్యాడ్‌గా మాట్లాడతారని భావించను. మీ ఫ్యామిలీ అలా మాట్లాడినా బాధ పడదు అంటే మాట్లాడు... మానవత్వం పరంగా చూస్తే అలా మాట్లాడటం తప్పు అని ఇషా గుప్తా అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications











