నాకు తిండి పెడుతున్నావా? నాతో సంసారం చేస్తున్నావా? మీ లైఫ్ దొబ్బిందని.. ట్రోల్స్‌పై ఫైర్
Recommended Video
సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు వ్యక్తిగత స్వేచ్ఛ కరువు అవుతుందనే విషయం మరోసారి రుజువైంది. తారలు ధరించే దస్తులు విషయంపై నెటిజన్ల కామెంట్లు వారిని తీవ్ర మనో వేదనకు గురి చేస్తున్నాయనే విషయం బయటపడింది. తాజాగా అందాల నటి ఇషా గుప్తా ఇటీవల ఫారిన్‌లో వెకేషన్‌కు వెళ్లింది. బీచ్‌లో బికినీలో దర్శనమివ్వడంతో నెటిజన్లు నోరు పారేసుకొన్నారు. నెటిజన్ల ట్రోలింగ్‌పై ఇషా గుప్తా మండిపడ్డారు. ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో..

ప్రతీ ఒక్కరిని కించపరిచే విధంగా
నెటిజన్లు వారి మనసులో ఏదో పెట్టుకొని కామెంట్లు చేయడం చాలా కోపంగా ఉంటుంది. వారి సమస్య ఏమిటో అసలు అర్ధం కాదు. ఎవరో వాల్ మీద ఏదో కించపరిచే విధంగా రాస్తే అందులో వారికి వచ్చే ఆనందం ఏమిటో అసలు అర్ధం కాదు. తాము చేసే కామెంట్లు ఎదుటి మనిషికి ఎంత నష్టం కలిగిస్తుందో వారికి తెలియదు అని ఇషా గుప్తా అన్నారు.

మీ లైఫ్ దొబ్బిదని ఇతరులపై
తమ లైఫ్ దొబ్బిందని నెటిజన్లు ఇతరుల ఆనందాన్ని కాజేయాలని ఆలోచించడం ఎంత వరకు సబబు. నన్నేమైనా వారు పోషిస్తున్నారు. నాతో వారేమైన సంసారం చేస్తున్నారా? లేదా ఆర్థికంగా నాకు అండగా నిలుస్తున్నారా? అవేమీ కానప్పుడు నెటిజన్లు చేసే కామెంట్లు నాకు ఎలాంటి బాధను కలిగించవు అని ఇషా చెప్పారు.

చెత్త వదిలేసి.. మంచి చేయండి..
నా వాల్స్‌పై చేసే ట్రోల్స్‌ను పట్టించుకోను. అలాంటి వారికి చెత్త కామెంట్లు చేసే బదులు... జీవితంలో ఏదైనా మంచి చేయమని చెబుతాను. సమాజంలో మంచి చ చేయడానికి చాలా విషయాలు ఉన్నాయి. బికినీ వేసుకొన్నామనో.. లేదా అలా డ్రస్ చేసుకొన్నావనే అనవసరపు విషయాలపై ఎందుకు సమయం వృధా చేయడం వేస్ట్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఒకరిని టార్గెట్ చేయడం ఎందుకు
సోషల్ మీడియాలో చెత్త వాగుడు వాగే కంటే సమాజానికి మేలు చేసే విషయాలపై దృష్టిపెట్టమని చెబుతాను. యుద్ధాలు జరుగుతున్నాయి. బాంబులు పేలుతున్నాయి. శరణార్థులకు తిండి లభించడం లేదు. ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరినో ఒకరిని టార్గెట్ చేయడం శుద్ద దండుగ అని అన్నారు. ప్రస్తుతం ఈ హాట్ హీరోయిన్ అనుపమ్ ఖేర్‌తో కలిసి వన్డే: జస్టిస్ డెలివర్డ్ అనే సినిమాలో నటిస్తున్నది. ఈ చిత్రం జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది.


Click it and Unblock the Notifications











