‘ఆ హీరో అందులో సీనియర్ .. బెడ్‌పై ఆయనతో ఇబ్బంది పడలేదు’

నటీనటులు ఇంటిమేట్ సీన్స్‌లో నటించడానికి ఎంతో ఇబ్బంది పడతారన్న సంగతి తెలిసిందే. పది మంది చూస్తుండగా, కెమెరా ముందు చాలా కష్టం. కొందరు హీరోయిన్లు ఇలాంటి ఇబ్బంది పడలేక .. కథా చర్చల సమయంలోనే అలాంటి సీన్స్ ఉంటాయో లేదో కనుక్కొంటారు. ఒకవేళ అలాంటి సీన్స్ కనుక ఉంటే ముందే ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటారు. ఇలా ఎందరో నటీనటులు బంగారం లాంటి సినిమాలను వదులకుని, కెరీర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టిన ఉదంతాలు ఉన్నాయి. అయితే తనకు అలాంటి ఇబ్బందులేం లేవంటోంది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ. ఈ వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ ఇంటిమేట్ సీన్స్ గురించి విపరీతంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఓటీటీల రాకతో వెబ్ సిరీస్‌లు విచ్చలవిడిగా వస్తున్నాయి. వాటిలో హాట్ , మసాలా కంటెంట్ ఎక్కువ అవుతోంది. ఈ క్రమంలోనే నటీనటులు కూడా వాటిలో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే కొందరు మాత్రం మొహమాట పడుతూ అలాంటి సీన్స్, వెబ్ సిరీస్‌లకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఇంటిమేట్ సీన్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ నటి ఈషా గుప్తా.

Esha Gupta on Aashram season 3 her open talk about that scenes with Bobby Deol

ఢిల్లీకి చెందిన ఈషా గుప్తా మోడల్‌గా కెరీర్ ప్రారంభించారు. 2007లో ఎంతో మంది అందగత్తెలను దాటుకుని ఫెమినా మిస్ ఇండియా పోటీలలో గట్టి పోటీ ఇచ్చి మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచిన ఈషా గుప్తా .. తర్వాత మిస్ ఇంటర్నేషనల్ పోటీలలో భారతదేశం తరపున ప్రాతినిథ్యం వహించారు. మోడల్‌గా ట్రాప్ బ్రాండ్స్‌కు ఎండార్స్‌మెంట్స్ చేసిన ఈషా గుప్తా.. ఈ క్రమంలో కింగ్‌షిఫర్ క్యాలెండర్‌ కోసం చేసిన ఫోటో షూట్‌తో కలకలం రేపారు.

2012లో జన్నత్ 2తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈషా గుప్తా తర్వాత రాజ్ 3డీ, చక్రవ్యూహ్, బేబీ, రుస్తుం, కమాండో 2, బాద్‌షాహోతో తెలుగులో వీడెవడు చిత్రంలో నటించారు. ప్రస్తుతం మర్డర్ 4, దేశి మేజిక్, హేరా పేరి 3లలో నటిస్తున్నారు. 40 ఏళ్ల వయసులోనూ చెక్కు చెదరని గ్లామర్‌తో కుర్రాళ్లకు సెగలు రేపుతుంటారు ఈషా గుప్తా. సోషల్ మీడియాలో ఆమె చేసే ఫోటో షూట్‌లకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. స్పెయిన్‌కు చెందిన వ్యాపారవేత్తతో డేటింగ్ చేశారు.

సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లలోనూ నటించిన ఈషా గుప్తా ఆశ్రమ్ 3లో దుమారం రేపారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్‌తో కలిసి బెడ్ రూం సీన్స్‌లో రెచ్చిపోయారు. ఆ సీజన్ హిట్ కావడం వెనుక ఆమె గ్లామర్ కీలకపాత్ర పోషించింది. అలాంటి సీన్స్‌లో నటించడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈషా గుప్తా.

ఇటీవల బాలీవుడ్ లైఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆశ్రమ్‌లో బాబీ డియోల్‌తో ఇంటిమేట్ సీన్స్ గురించి యాంకర్ ప్రస్తావించారు. తాను ఆ సీన్స్‌ను ఇష్టపడే చేశానని.. దాదాపు పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నానని, అలాంటప్పుడు సిగ్గు ఎందుకని ఆమె ప్రశ్నించారు. బాబీ డియోల్ పరిణితి చెందిన వ్యక్తి అని .. అలాంటి రొమాన్స్ సీన్స్ చేసిన అనుభవం ఉందని, అందుచేత నాకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదని ఈషా గుప్తా బోల్డ్ కామెంట్స్ చేశారు. కథ మేరకు నటించిన బాబీ డియోల్.. నియంత్రించుకోగలరని ఆమె అన్నారు. ప్రస్తుతం ఈషా గుప్తా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: esha gupta bobby deol
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X