హ్యకైన ఇషా గుప్త ట్విట్టర్ అకౌంట్.. ఫ్యాన్స్‌కు అప్పీల్!
హాట్ బ్యూటీ ఇషా గుప్త ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కు గురైంది. ఈ విషయాన్ని ఇషా గుప్త స్వయంగా వెల్లడించింది. నా ట్విట్టర్ అకౌంట్ ని హ్యాక్ చేశారు. నా ట్విట్టర్ నుంచి వచ్చే ఏ లింకుని ఓపెన్ చేయవద్దు. మోసం కావచ్చు. నేను చెప్పే వరకు నా అకౌంట్ నుంచి వచ్చే ఏ సందేశాన్ని నమ్మవద్దు అంటూ సూచించింది.
సెలెబ్రిటీల సోషల్ మీడియా విభాగం హ్యాక్ కు గురికావడం కొత్త కాదు. గతంలో చాలా సార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇషా గుప్త హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్యన అర్థ నగ్నంగా చేసిన ఫోటో షూట్స్ వైరల్ గా మారాయి.
ఫోటో షూట్స్ తోనే ఇషా గుప్త సోషల్ మీడియాలో లక్షలాది ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇషా గుప్త పల్టాన్, టోటల్ ఢమాల్ అనే చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు డెవిల్స్ డాటర్ అనే చిత్రంలో కూడా నటించేందుకు సిద్ధం అవుతోంది.



Click it and Unblock the Notifications











