హీరో గర్ల్ ఫ్రెండ్ కోసం రాత్రికి రాత్రే తొలగించారు.. సాహో బ్యూటీ షాకింగ్ కామెంట్స్
సినిమా ఇండస్ట్రీలో నెపోటిజమ్ పై రోజురోజుకి స్టార్స్ నుంచి విభిన్న అభిప్రాయాలు ఎక్కువగా వస్తున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఘటన ఒక ఊహించని వాతావరణాన్ని నెలకొల్పిందదనే చెప్పాలి. ఇక ఇటీవల సాహో బ్యూటీ ఎవ్లీన్ శర్మ కూడా నెపోటిజమ్ పై కామెంట్స్ చేసింది. ఒక వ్యక్తి గర్ల్ ఫ్రెండ్ కోసం ఆమెను సినిమాలో నుంచి తిసేసినట్లు ఆమె వివరణ ఇచ్చింది.

సాహో బ్యూటీని తీసేశారట..
యే జవానీ హై దీవాని', ‘సాహో' వంటి చిత్రాలతో మంచి క్రేజ్ అందుకున్న ఎవ్లీన్‌ను కొన్ని సినిమాలకు ఎంచుకొని.. రాత్రికి రాత్రే తీసేశారట. ఈ బ్యూటీ చాలా వరకు కాంట్రవర్సీ విషయాలకు చాలా దూరంగా ఉంటుంది. అయితే చాలా రోజుల తరువాత ఈ విధంగా కామెంట్స్ చేయడం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

కావాలనే అలా చేశారు..
ఎవ్లీన్ కామెంట్స్ ని బట్టి చూస్తే ఆమెను ఒక స్టార్ హీరోనే కావలని తనకు వచ్చిన అవకాశాలను క్యాన్సిల్ చేశాడని కామెంట్స్ వస్తున్నాయి. ఇటీవల ఇంటర్వ్యూలో ఎవ్లీన్ తనకు వచ్చిన అవకాశాలు చివరి నిమిషంలో ఎలా మిస్ అయ్యాయి అనే విషయాలపై ఒక వివరణ ఇచ్చింది.

అతని గర్ల్ ఫ్రెండ్ కోసం..
ఎవ్లీన్ మాట్లాడుతూ.. నా ప్రతిభను చూపించడానికి అవకాశం లేని చిన్న చిన్న ఆఫర్స్ నాకు చాలానే వచ్చాయి. అయితే కెరీర్ లో కొన్నిసార్లు నెపోటిజమ్ కారణంగా అలాంటి అవకాశాలు కూడా వధులుకోవాల్సి వచ్చింది. ఒకరి గర్ల్ ఫ్రెండ్ కోసం కూడా రాత్రికి రాత్రే సినిమాలో నుంచి తప్పించారు అంటే పరిస్థితి ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చని ఎవ్లీన్ శర్మ తెలిపింది.

డబ్బున్నవాడిదే అధికారం..
అలాంటి అవకాశాలు మిస్సవ్వడం తనకు కొత్తేమి కాదని అయితే అలాంటి వాటి వల్ల నిరాశచెందలేదని తెలిపింది. ఇక అలాంటి ఘటనలు తనను మరింత ధైర్యంగా మార్చాయని చెబుతూ.. బాలీవుడ్ లో అధికారం డబ్బు వంటి విషయాలతోనే అన్ని నడుస్తాయని ఇక్కడ ఉన్నవాడిదే ఆధిపత్యమని ఈ బాలీవుడ్ బ్యూటీ చాలా క్లియర్ గా బయటపెట్టేసింది.

ఆ స్టార్ హీరో ఎవరు..
ఇక ఎవ్లీన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా.మారుతున్నాయి. ఒక స్టార్ హీరో కారణంగానే ఆమెకు అవకశాలు దక్కడం లేదాని అతను తన గర్ల్ ఫ్రెండ్ కోసం ఎవ్లీన్‌కు ఆవకాశం ఇవ్వకుండా చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఎవ్లీన్ ఎప్పుడు లేని విధంగా తనకు జరిగిన అన్యాయం గురించి మొదటిసారి స్పందించడంతో ఆమెకు ఓ వర్గం అభిమానుల నుంచి మద్దతు లభిస్తోంది.


Click it and Unblock the Notifications











