క్రికెటర్ భార్య, సినీనటి కారుపై అటాక్.. దుండగులు ఏం చేశారో తెలుసా!

90 దశకంలో నటి ఫర్హీన్ పలు బాలీవుడ్ చిత్రాల్లో రాణించారు. చెన్నైకి చెందిన ఫర్హీన్ బాలీవుడ్ నటిగా రాణిస్తూ మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ ని చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా మనోజ్ ప్రభాకర్, ఫర్హీన్ ఇద్దరూ ఉహించని ఘటనతో వార్తల్లో నిలిచారు. దేశరాజధాని నగరంలో తక్ తక్ దోపిడీ దొంగల గ్యాంగ్ హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దోపిడీ దొంగల బారీన మనోజ్ ప్రభాకర్, ఫర్హీన్ దంపతులు పడ్డారు. అసలేం జరిగిందో వివరాల్లో తెలుసుకుందాం..

షాపింగ్ మాల్‌కి వెళుతూ

షాపింగ్ మాల్‌కి వెళుతూ

ఫర్హీన్, ప్రభాకర్ దంపతులిద్దరూ కారులో సౌత్ ఢిల్లీలోని ఓ షాపింగ్ మాల్ కు పయనం అయ్యారు. కారు ఓ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న సమయంలో నలుగురు దుండగులు వాహనాన్ని చుట్టుముట్టారు. వారు గత కొన్ని రోజులుగా దోపిడీలు చేస్తున్న తక్ తక్ గ్యాంగ్ అని పోలీసులు సిసి టివి ఫుటేజ్ ద్వారా నిర్ధారించారు. తక్ తక్ గ్యాంగ్ తమ పథకాన్ని అమలు చేసి ఫర్హీన్ నుంచి మొబైల్ ఫోన్, వ్యాలెట్ చోరీ చేసి పరారైనట్లు తెలుస్తోంది.

డ్రైవింగ్ సరిగా చేయడం లేదంటూ

డ్రైవింగ్ సరిగా చేయడం లేదంటూ

సిగ్నల్ వద్ద కారు ఆగిఉన్న సమయంలో తక్ తక్ గ్యాంగ్ ఫర్హీన్ కారు డ్రైవర్ తో కావాలనే గొడవ పెట్టుకున్నారు. సరిగా డ్రైవింగ్ చేయడం లేదంటూ అసభ్యంగా అతడిని తిట్టారు. ఈ గందర గోళంలో ఫర్హీన్ నుంచి మొబైల్ ఫోన్, వ్యాలెట్ లాక్కునట్లు తెలుస్తోంది. మనోజ్ ప్రభాకర్ వారిని నిలువరించడానికి ప్రయత్నించినా కుదర్లేదు. ఇదంతా వారి పథకంలో భాగమని పోలీసులు చెబుతున్నారు.

కుదరక పోతే

కుదరక పోతే

ఆ గొడవలో ఏమైనా తేడా జరిగితే మనుషులపై వారు భౌతిక దాడికి కూడా పాల్పడతారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. మనోజ్ ప్రభాకర్ వారిని వెంబడించాడు కూడా ప్రయత్నించాడు. కానీ ఆ గ్యాంగ్ లో మరో వ్యక్తి రోడ్డు పక్కనే కారుతో సిద్ధంగా ఉన్నాడు. చోరీకి పాల్పడిన వారిని ఎక్కించుకుని క్షణాల్లో అక్కడి నుంచి మాయమయ్యారు.

కేసు నమోదు

కేసు నమోదు

మనోజ్ ప్రభాకర్, ఫర్హీన్ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం వ్యాలెట్ లో 16వేల నగదు, మొబైల్ ఫోన్, పలు విలువైన డాక్యుమెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో పోలీసలు కేసు నమోదు చేసి సిసి టివి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. తక్ తక్ గ్యాంగ్ కి సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. వారి ప్రభావం సెలెబ్రిటీలపై కూడా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X