ఆ హీరో వల్లే కెరీర్ నాశనమైంది..చేతబడి చేసి ఆమెను స్టార్‌ని చేశారు.. నాతో శృంగారం చేయించారంటూ నటి సంచలనం!
అన్ని సినీ పరిశ్రమలలో లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. కానీ తాజాగా బిగ్ బాస్ ఫేమ్ పూజ మిశ్రా చేసిన వ్యాఖ్యలు మాత్రం బాలీవుడ్ లో కలకలం రేపుతున్నాయి. బాలీవుడ్లో ఒకప్పుడు హీరోగా చక్రం తిప్పి ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న శత్రుఘ్నసిన్హా మీద పూజ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

హీరోయిన్ చేయడం కోసం
బాలీవుడ్ నటి, బిగ్ బాస్ ఫేమ్ పూజ మిశ్రా సీనియర్ నటుడు శత్రుఘ్నసిన్హా మీద చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఆయన తన కుమార్తె సోనాక్షి సిన్హా హీరోయిన్ గా ఎదగడం కోసం ఆమె బంగారు భవిష్యత్తు కోసం తన కన్యత్వాన్ని తాకట్టు పెట్టాడని తనను వ్యభిచారిగా మార్చాడు అంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఒక ఫ్యాషన్ డిజైనర్ గా ఉండి పోవాల్సిన తన కుమార్తెను హీరోయిన్ చేయడం కోసం తన జీవితాన్ని శత్రుఘ్నసిన్హా కుటుంబ సభ్యులు బలి ఇచ్చారు అంటూ ఆమె ఆరోపించింది.

లైంగిక కార్యక్రమాల్లో
తన తండ్రి, శత్రుఘ్నసిన్హా ఇద్దరు స్నేహితులు అని శత్రుఘ్నసిన్హా కోసం తన తండ్రి కోట్ల రూపాయల డబ్బు కూడా ధారపోస్తే తనను వాళ్ళు ఈ విధంగా వాడుకున్నారు అంటూ ఆమె ఆరోపించింది. తనను శత్రుఘ్నసిన్హా కుటుంబం అంతా కలిసి 17 ఏళ్లుగా వాడుకుంటున్నారని తన మీద చేతబడి కూడా చేశారని ఆమె ఆరోపించింది. చేతబడి చేయడం ద్వారా తాను ఏం చేస్తున్నానో తెలియని స్థితిలో లైంగిక కార్యక్రమాల్లో పాల్గొనేలా చేశారని ఆమె ఆరోపణలు చేసింది. తాను ఒక సమయంలో శత్రుఘ్నసిన్హా జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన నివాసానికి వెళ్లాను అని ఆమె పేర్కొంది.

చేతబడి చేయించిందని
ఈ సమయంలో ఆయన భార్య తనకు ఆహార పదార్థాలు తినిపించి చేతబడి చేయించిందని ఆమె ఆరోపించింది. ఆ తిండి పదార్థాలు తిన్న తర్వాత తన శరీరం మీద అదుపు కోల్పోయానని, అప్పటి నుంచి ప్రతి సారి చేతబడి చేసి తనను వ్యభిచారి గా మార్చి వేశారని ఆమె పేర్కొంది. శత్రుఘ్నసిన్హా తన కెరీర్ ను నాశనం చేశారని పేర్కొన్న పూజ మిశ్రా తను స్టార్ హీరోయిన్ కాకుండా అడ్డుకుని తమ కుమార్తెను స్టార్ హీరోయిన్ గా చేసుకునేందుకు ప్రయత్నాలు చేశారని వారి వల్ల ఇప్పటికి పెళ్లి కూడా చేసుకోకుండా ఉండిపోవలసి వచ్చిందని ఆమె ఆరోపించింది.

సోనాక్షి సిన్హా ఫోటో షూట్ల
సుమారు ఏడేళ్లపాటు శత్రుఘ్నసిన్హా ఫ్యామిలీ అపార్ట్ మెంట్ లో నేను ఉండేదాన్ని శత్రుఘ్నసిన్హా కుటుంబం మా పై పోర్షన్లో ఉండే వారని ఆమె ఆరోపించింది. అంతేకాక తాను సింగపూర్ షాపింగ్ కి వెళ్లి తిరిగి వచ్చే సమయానికి తన రూమ్ లో ఉండవలసిన వస్తువులు కనిపించకుండా పోయేవని వాటిని సోనాక్షి సిన్హా ఫోటో షూట్లలో చూసేదాన్ని అని ఆమె పేర్కొన్నారు.

చట్టపరంగా చర్యలు తీసుకుంటా
అయితే ఈ ఆరోపణల మీద అ శత్రుఘ్నసిన్హా కుమారుడు, సోనాక్షి సిన్హా సోదరుడు లవ్ సిన్హా స్పందించాడు ఆమెకు సినిమా అవకాశాలు కావాలి అనుకుంటా, నా కుటుంబం మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్న అప్పుడే ఆమె మానసిక స్థితి సరిగా లేదని అందరికీ అర్థమవుతుంది. సాధారణంగా ఇలాంటి చెత్త విషయాల మీద స్పందించి నేను సమయం వృధా చేసుకొను కానీ నిజానిజాలు తెలుసుకోకుండా మా కుటుంబ గౌరవానికి భంగం కలిగించే ఇలాంటి కథనాలు రాసి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటా అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. నిజానిజాలు ఏమైనా ఉంటాయో తెలియదు కానీ పూజా చేసిన సంచలన వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో రచ్చ రేపుతున్నాయి.


Click it and Unblock the Notifications











