twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సైరాట్’ దర్శకుడు మరీ ఇంత నీచుడా? మాజీ భార్య షాకింగ్ కామెంట్స్

    |

    'సైరాట్'... తెలుగు సినీ అభిమానులు ఎక్కువగా చూసిన మరాఠీ సినిమా ఇది. 2016లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఓ సెన్సేషన్. ఈ చిత్రాన్ని తెరకెక్కించి నాగరాజ్ మంజులే ఒక్కసారిగా పెద్ద స్టార్ అయిపోయాడు. నాగరాజ్ చిత్రాలు పరిశీలిస్తే సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. అయితే సినిమాల్లో అలాంటి చూపించే వారు, సినిమాల్లో బుద్దిమంతులుగా నటించే వారు మహిళల పట్ల గౌరవంగా ఉంటారా? అంటే చెప్పడం కష్టం. తాజాగా నాగరాజ్ మంజులే మాజీ భార్య సునీత అతడి గురించి 'క్వింట్' అనే వెబ్ పత్రికతో చెప్పిన విషయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి.

     18, 19 ఏళ్లకే పెళ్లి జరిగింది

    18, 19 ఏళ్లకే పెళ్లి జరిగింది

    ‘నాకు 18-19 సంవత్సరాలు ఉన్నపుడు నాగరాజుతో పెళ్లి జరిగింది. ఆ సమయంలో నాగరాజ్ సినిమా దర్శకుడు అయ్యేందుకు కష్టపడుతూ ఉండేవాడు. నేను ఆ ఇంటి పెద్దకోడలిని. విలేజ్‌లో ఫ్యామిలీ బాగోగులు చూసుకునేదాన్ని. నాగరాజ్ సిటీకి వెళ్లి చదువుకునే వాడు' అని సునీత గుర్తు చేసుకున్నారు.

     ముంబై తీసుకెళతానని ప్రామిస్ చేశాడు

    ముంబై తీసుకెళతానని ప్రామిస్ చేశాడు

    కుటుంబం కోసం సునీత రాత్రింభవళ్లు కష్టపడుతున్న సమయంలో నాగరాజ్ ఆమెకు ప్రామిస్ చేశాడు. తాను పెద్ద దర్శకుడిని అయిన తర్వాత నిన్ను ముంబై తీసుకెళతానని చెప్పేవాడట. కుటుంబంలో చాలా సమస్యలు వచ్చినా నాగరాజ్ మీద ప్రేమతో అవన్నీ తాను భరించినట్లు సునీత చెప్పుకొచ్చారు.

    నన్ను గదిలో పెట్టి తాళం వేశారు

    నన్ను గదిలో పెట్టి తాళం వేశారు

    నాగరాజ్ మంజులే దర్శకత్వంలో వచ్చిన షార్ట్ ఫిల్మ్ ‘పిస్తుల్యా'కు జాతీయ అవార్డు వచ్చింది. అయితే అవార్డు అందుకోవడానికి ఫ్యామిలీ మొత్తం ఢిల్లీ వెళుతూ తనను గదిలో ఉంచి తాళం వేశారు అని సునీత వాపోయారు.

    దారుణంగా హింసించేవాడు

    దారుణంగా హింసించేవాడు

    నాగరాజ్ ఆడవారిని ఇంటికి తీసుకొచ్చేవాడు. వారికి నేను వండి పెడుతూ సేవలు చేసేదాన్ని. నన్ను వదిలిపెట్టొద్దు అని అతడిని వేడుకునేదాన్ని, నాకు గర్భం వస్తే అతడి ఫిల్మ్ డ్రీమ్‌కు అడ్డంకిగా ఉంటుందని అబార్షన్ చేయించేవాడు రెండు మూడు సార్లు అలా అయ్యాక నేను తిరగబడ్డాను. అపుడు నన్ను దారుణంగా కొట్టేవాడు, ఒక్కోసారి లెదర్ బెల్ట్, పొడవాటి కర్రతో చితకబాదేవాడు.. అని సునీత గుర్తు చేసుకున్నారు.

    Recommended Video

    Dhadak Movie Review ధడక్ సినిమా రివ్యూ
     పాచిపని చేస్తూ జీవిస్తున్న సునీత

    పాచిపని చేస్తూ జీవిస్తున్న సునీత

    నాగరాజ్ పెట్టే బాధలు భరించలేక నా తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయాను. 2012లో విడాకులు ఫైల్ చేస్తే 2014లో వచ్చాయి. రూ. 7 లక్షలు భరణం రూపంలో వచ్చింది. ప్రస్తుతం తాను వివిధ ఇళ్లలో పాచి పనులు చేస్తూ జీవిస్తున్నట్లు సునీత వెల్లడించారు.

    English summary
    Nagraj Manjule, director of the critically and commercially acclaimed Marathi film Sairat (2016), has always been termed as an adversary for women. In a detailed narration to Quint, Nagraj's ex-wife Sunita Manjule revealed some alleged shocking details about the filmmaker that will leave you stumbled.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X