Don't Miss!
- News
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కానుక-మన విద్యార్ధులకు 75 స్కాలర్ షిప్ లు ప్రకటించిన బ్రిటన్
- Technology
భారత మార్కెట్లోకి OnePlus Nord 2T 5G విడుదల.. ధర ఎంతంటే!
- Finance
Multibagger Stock: ఇన్వెస్టర్లను ధనవంతులు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్.. లక్ష పెట్టిన వారికి రూ.5 లక్షలు..
- Automobiles
ఆటమ్ వాడెర్ ఇ-బైక్‌ని లాంచ్ చేసిన హైదరాబాద్ కంపెనీ.. మొదటి 1000 మంది కస్టమర్లకు బంపర్ ఆఫర్!
- Sports
India vs England 5th Test Weather : తొలి రోజు వర్షార్పణమే.. ‘టెస్ట్’ పెట్టనున్న వరుణ దేవుడు..!
- Lifestyle
ఈ 5 రాశుల తండ్రులు వారి పిల్లల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తారు..అందుకే చెడ్డ నాన్నలు కావచ్చు...
- Travel
సీనియర్ సిటిజన్స్‌తో ట్రావెల్ చేస్తే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Salman Khan తో వెంకటేష్ మల్టీస్టారర్.. షూటింగ్ ఎక్కడో తెలుసా?
F3 మూవీ రిలీజ్‌తో మంచి జోష్‌లో ఉన్న విక్టరీ వెంకటేశ్ మరో మల్టీస్టారర్ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ సారి తెలుగు సినిమా కాకుండా బాలీవుడ్ సినిమా కోసం సల్మాన్ ఖాన్‌తో నటించేందుకు సిద్ధమవుతున్నారు. సల్మాన్ ఖాన్‌తో కలిసి కభీ ఈద్ కభీ దీవాళీ చిత్రంలో నటించనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ అంతా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో జరుగనున్నది.

ఫర్హాద్ సమ్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు సంబంధించిన షూటింగ్ కోసం కోకాపేటలో భారీ సెట్ వేశారు. ఈ సెట్లోనే రెండు షెడ్యూల్స్ షూటింగ్ చేస్తారు. కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేస్తారు. పూజా హెగ్గే నటిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్, ముంబైలో షూటింగ్ ముగించి డిసెంబర్ 30వ తేదీన రిలీజ్‌కు సిద్దమవుతున్నది.
హైదరాబాద్‌లో జరిగే షూటింగులో సల్మాన్ ఖాన్, ఆయన పక్కన నటించే సోదరుల క్యారెక్టలపై ప్రధాన సన్నివేశాలు చిత్రీకరిస్తారు. అలాగే పూజా హెగ్డే, సల్మాన్ ట్రాక్ షూటింగ్ జరుపుతారు. ఇదే సమయంలో వెంకటేష్, సల్మాన్ మధ్య సీన్స్ చిత్రీకరణ పూర్తి చేస్తారు అని సినీ వర్గాలు వెల్లడించారు. ఈ చిత్రం జగపతిబాబు కూడా కీలక పాత్రను పోషిస్తారు.
అయితే కభీ ఈద్ కభీ దీవాళీ చిత్రం తమిళంలో రూపొందిన వీరమ్, తెలుగులో కాటమరాయుడు సినిమా ఆధారంగా రూపొందుతున్నది. అయితే ఇటీవల వెంకటేశ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. వీరమ్ సినిమా ప్రధాన కథను తీసుకొన్నాం. మిగితాది ప్రస్తుతం పరిస్థితులకు అనుగుణంగా మార్చేశాం. వీరమ్, కాటమరాయుడు సినిమాలకు ఎక్కడ పోలిక ఉండదు అని వెంకటేష్ తెలిపారు.
ఇదిలా ఉండగా, వెంకటేశ్ నెట్‌ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఇందులో రానా దగ్గుబాటి కూడా నటించడం గమనార్హం. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానున్నది.