Divorce దిశా పటానీ లవర్‌తో హార్థిక్ పాండ్యా భార్య రొమాన్స్.. క్రికెటర్‌తో విడాకులు.. వాస్తవం ఏమిటంటే?
ఐపీఎల్ 2024 ముగుస్తుండగా.. ఒక్కసారిగా హార్థిక్ పాండ్యా విడాకుల వ్యవహారం మీడియాలో భగ్గుమన్నది. గత కొద్దికాలంగా హర్థిక్ పాండ్యా భార్య నటాషా స్టాంకోవిక్ నర్మగర్బంగా ట్వీట్లు చేస్తూ లీకులు ఇస్తుండటంతో అనేక అనుమానాలు తలెత్తాయి. అయితే ఎప్పడూ భర్త హార్థిక్ ఇన్స్‌టాగ్రామ్‌తో యాక్టివ్‌గా ఉండే ఈ అందాల భామ కొద్దికాలంగా అంటి ముట్టనట్టు ఉంటున్నారు. అయితే తాజాగా దిశా పటానీ లవర్‌తో రొమాంటిక్ మూడ్‌లో కనిపించడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూర్చింది. ఈ హాట్ టాపిక్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
క్రికెటర్ హార్థిక్ పాండ్యా, నటాషా ఇద్దరు చాలాకాలం డేటింగ్ చేశారు. కోవిడ్ సమయంలో తమ అభిమానులకు షాకిస్తూ.. మే 2020లో వివాహం చేసుకొన్నారు. సీక్రెట్‌గా వివాహం జరగడం, కోవిడ్ పరిస్థితులు ఉండటంతో ప్రముఖులు కూడా దూరంగా ఉన్నారు. దాంతో వారి వివాహ విషయం కాస్త ఆలస్యంగానే వెలుగు చూసింది. వారికి ఏడాది తర్వాత అబ్బాయి పుట్టాడు. ప్రస్తుతం అగస్త్య పాండ్యాకు మూడేళ్లు. గత కొద్దికాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకొన్నట్టు వార్తలు వస్తున్నాయి.

హార్థిక్ పాండ్యా, నటాషా మధ్య రోజు రోజుకు దూరం పెరుగుతున్నది. వారిద్దరి మధ్య పరిష్కరించుకోలేని విధంగా గ్యాప్ పెరిగింది. దాంతో వైవాహిక జీవితంలో కలతలు చోటు చేసుకొన్నాయనే వార్తల మధ్య ఆమె తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ నుంచి తన భర్త పేరును తొలగించింది. దాంతో సపరేషన్ అనుమానాలు మరింత బలపడ్డాయి.
ఇక తాజాగా ముంబైలో దిశా పటానీ లవర్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతూ కనిపించడంతో ఆ సందేహాలు, అనుమానాలు రెట్టింపు అయ్యాయి. ఇక హర్ధిక్ పాండ్యాకు ఆమె గుడ్ బై చెప్పిందనే విషయం మరింత ప్రచారం జరిగింది. అయితే అటు పాండ్యా గానీ.. నటాషా గానీ పెద్దగా నోరు విప్పలేదు. కానీ వార్తలు మాత్రం మీడియాలో దావానలంగా వ్యాప్తి చెందాయి.
ఇదిలా ఉండగా.. ముంబైలో మీడియా కెమెరాలకు చిక్కిన నటాషాను.. ఫోటో జర్నలిస్టులు విడాకుల ప్రస్తావన తీసుకొని రాగా.. నవ్వుతూ కనిపించింది. పదే పదే ఆమె ఆ విషయాన్ని అడిగితే.. మౌనంగా ఉంది. హార్ధిక్ పాండ్యాతో విడాకులు తీసుకొంటున్నారా? అంటే థ్యాంక్యూ అంటూ ఓ మాట వారి ముఖాన పడేసి నవ్వుకొంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఇదిలా ఉండగా.. నటాషా విషయానికి వస్తే..సెర్బియాకు చెందిన డ్యాన్సర్, మోడల్, నటి. బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకొనేందుకు ముంబైలో అడుగుపెట్టింది. ప్రకాశ్ ఝా రూపొందించిన సత్యగ్రహ చిత్రంలో నటించింది. బిగ్‌బాస్ 8, నాచ్ బలియా 9 రియాలిటీ షోలో పాల్గొన్నది. హర్ధిక్‌తో ప్రేమలో పడి వివాహం చేసుకోవడంతో ఆమెకు సెలబ్రిటీగా మరింత గుర్తింపు లభించింది.


Click it and Unblock the Notifications











